విశాలాంధ్ర -ధర్మవరం; శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రకటించిన మొదటి సెమిస్టర్ ఫలితాలలో స్థానిక ఎల్. పి. సర్కిల్ లోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి బి ఏ గ్రూపు నందు బి. అపర్ణ:-90 శాతము, కె.షబానా:-88.5 శాతము, జె.అమృత వర్షిణి :-87.5 శాతము, అదేవిధంగా బీకాం గ్రూపు నందు ఎస్. సహనార :-88 శాతము, పి. జ్యోతి :-86 శాతము, డి. కుసుమ :-86 శాతము,S. అమ్రిన్ :-85 శాతము, ఎస్. హజీరా బాను :-83 శాతము, తదుపరి బీఎస్సీ గ్రూపు నందు టీ. లక్ష్మీ ప్రసన్న:- 83 శాతము, టీ. జీవిత :-82 శాతము, జి. మేఘన సాయి ప్రణతి:-81 శాతము తో యూనివర్సిటీ టాపర్స్ గా నిలిచిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున, కరెస్పాండెంట్ సాయి, డైరెక్టర్ జగదీశ్ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.కేవలం అత్యధిక మార్కులనే గాక ఓవరాల్ 100 శాతము ఫలితాలతో ఏ కోణంలో విశ్లేషించిన” శ్రీ పద్మావతి”విద్యా వైభవం ప్రస్ఫుటంగా సాక్షాత్కరించింది అని తెలిపారు.ఇంతటి ఘన విజయానికి కారణమైన తల్లి తండ్రులకు, అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలియ చేశారు.
మొదటి సెమిస్టర్ ఫలితాలలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల విజయ పరంపర
RELATED ARTICLES