ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక సహకారంతో ధర్మవరంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హాకీ టర్ఫ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ధర్మవరం బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు, డిప్యూటీ తహసిల్దార్ సురేష్, హాకీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్య ప్రకాశ్ , ఇతర అధికారులతో కలిసి హరీష్ బాబు ధర్మవరం పట్టణ పరిధిలోని ఎర్రగుంట్ల, పోతుకుంట కాలనీ, తారకరామాపురం, వంటి మూడు ప్రాధాన్యత గల ప్రాంతాల్లో స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ – ఇది కేవలం ఒక క్రీడా మైదానం మాత్రమే కాదు. ఇది ధర్మవరం యువతకు అవకాశాల తలుపులు త్రాసే అరుదైన అవకాశంగా నిలవనుంది అని తెలిపారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ దూరదృష్టితో , క్రీడల అభివృద్ధిపై ఉన్న నిబద్ధతతో, మన ప్రాంతంలో హాకీ వంటి ప్రాచీన ,ప్రతిష్ఠాత్మక క్రీడకు కొత్త ఊపునిచ్చే విధంగా ఈ టర్ఫ్ నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే స్థలం ఖరారు చేసి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నారని తెలిపారు. ఈ కార్యచరణ ద్వారా ధర్మవరం యువతకు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకునే సదవకాశం లభించడం అదృష్టం అన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్రీడలు, యువత అభివృద్ధికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ ప్రక్రియ దానికి మరో సాక్ష్యంగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, సర్వేర్, అధికారులు, మంత్రి కార్యాలయ సిబ్బంది, హాకీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్య ప్రకాశ్, బి. గౌరీ ప్రసాద్, సీనియర్ కోచ్ హస్సేన్, బిల్లే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం లో హాకీ టర్ఫ్ ఏర్పాటు
RELATED ARTICLES