Thursday, May 22, 2025
Homeజిల్లాలుఅనంతపురంగవి మఠం భూములను వేలం పాటను వెంటనే రద్దు చేయాలి

గవి మఠం భూములను వేలం పాటను వెంటనే రద్దు చేయాలి

డి ఆర్ ఓ ఏ. మలోల కు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ వినతులు

విశాలాంధ్ర- అనంతపురం : గవి మఠం భూములను వేలం పాటను వెంటనే రద్దు చేయాలి డి ఆర్ ఓ ఏ. మలోల కు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ , ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవరెడ్డి గురువారం కలెక్టరేట్లోని డి ఆర్ వో ఆఫీస్ లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం, కొత్తకోట గ్రామం గవి మఠానికి సంబంధించిన సాగు చేసుకుంటున్న వ్యవసాయదారులకు సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సాగు క్రమబద్ధీకరణ చేయాలని సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. సాగుకు సంబంధించి సర్వేనెంబర్ 590 బి 12. 57 ఎకరాలు 835 సర్వేనెంబర్ 39.63 ఎకరాలు ఈ భూములు గతంలో 30 సంవత్సరాల క్రితం సిపిఐ రాష్ట్ర నాయకులు ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ నేతృత్వంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు భూములు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన గుత్తలు ఎప్పటికప్పుడు కడుతున్నారన్నారు. సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు ఒక సెంటు భూమి లేదు, ఒక ఎకరా భూమి లేదన్నారు. గవి మఠం సంబంధించి దేవదాయ శాఖ ఉన్నపలంగా ఈ నెల 23వ తేదీ వేలంపాటలు వేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాలుగా సాగులో ఉంటున్నటువంటి వారికి అవకాశం కల్పించాలని క్రమబద్ధీకరణ చేయాలని వేలంపాటలు రద్దు చేయాలని ఇది వరకు ఉన్న పద్ధతుల్లోనే కొనసాగించాలని డి ఆర్ ఓ ను కోరడం జరిగిందన్నారు. డి ఆర్ వో సానుకూలంగా స్పందించారన్నారు. ఈ విషయంపై ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. కావున తక్షణం సాగుదారులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విడపనకల్లు సిపిఎం మండల కార్యదర్శి చండ్రాయుడు, పుట్లూరు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు