శ్రీ సత్య సాయి సేవా సమితి -2 నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి -2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది ఆసుపత్రి సిబ్బంది చేత పాలు, బ్రెడ్డు, బిస్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి-2, సుబ్బదాసు భజన మందిరం పిఆర్టి సర్కిల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సేవాదాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య సహకరించడం జరిగిందని తెలిపారు. తదుపరివారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే చక్కటి మనశ్శాంతి సుఖవంతమైన జీవితం లభిస్తుందని తెలిపారు. పుట్టపర్తి సాయిబాబా దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం మాకెంతో గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి-2 వారు చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం అవుతాయని తెలిపారు. తదుపరి ఆసుపత్రి సిబ్బంది తరపున వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి, సంతోషం
- Advertisement -
RELATED ARTICLES


