Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు మరింత సేవలు లయన్స్ క్లబ్ ద్వారా అందించాలి..

పేద ప్రజలకు మరింత సేవలు లయన్స్ క్లబ్ ద్వారా అందించాలి..

- Advertisement -

లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గౌతమ్
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు మరింత సేవలు లైన్స్ క్లబ్ ద్వారా త్వరితగతిన అందించాలని, తద్వారా లైన్స్ క్లబ్ మంచి గుర్తింపు పొందే అవకాశం ఉందని లైన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గౌతం పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎర్రగుంట లో గల లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి కార్యాలయాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం లైన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న పలు సేవలను వారు కొనియాడారు. ఇంతవరకు లైన్స్ క్లబ్ ద్వారా చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను, వారు అడిగి సంవత్సరంలో 360 మందికి కంటి ఆపరేషన్లు చేయించుట, ఉచితంగా అద్దాలను ఇవ్వటలో జిల్లాలోనే మంచి ప్రతిభను ఘనపరచడం పట్ల వారు క్లబ్ కమిటీని అభినందించారు. కంటి వైద్య శిబిరాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తే, మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇంటర్నేషనల్ ద్వారా ధర్మవరం లైన్స్ క్లబ్ కు కావలసిన సదుపాయాలు సహకారాలు తప్పకుండా త్వరలో అందిస్తానని వారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా లయన్స్ క్లబ్ కు యూత్ కూడా ముందుకు వస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం మెండుగా ఉన్నాయని తెలిపారు. అనంతరం గవర్నర్ గౌతమ్, క్యాబినెట్ కార్యదర్శి జనార్ధన్ లను లైన్స్ క్లబ్ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, లైన్స్ క్లబ్ వ్యవస్థాపకులు పిట్ట వెంకటస్వామి, రత్న శేఖర్ రెడ్డి, కార్యదర్శి నాగేంద్ర, పళ్లెం వేణుగోపాల్, ఉట్టి శివప్రసాద్, గోశే రాధాకృష్ణ,మేటికల కుల్లాయప్ప, నాగరాజు,రాజు (నేత), తదితర సీనియర్ జూనియర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు