టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం తో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు….
ఇరుకు సందులు గా పట్టణంలో పలు రహదారులు….
విశాలాంధ్ర నందిగామ:-అక్రమ కట్టడాలకు అడ్డగా నందిగామ తయారైందంటే దానికి కారకులు టౌన్ ప్లానింగ్ అధికారులే అంటున్నారు పట్టణ ప్రజలు చిన్న చిన్న కారు వారు గృహాలు నిర్మించుకుంటే వారిపై అనేక నిబంధనలు చూపిస్తూ వారి నిర్మాణాలకు ఆటంకాలు కలిగించే సదరు అధికారులు పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మాణాలు చేసే వారి వద్ద ఎందుకు అటువంటి నియమ నిబంధనలు పాటించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పట్టణ పరిధిలో నిర్మాణాలు చేసే వాళ్ళందరికీ ఒకే రూట్స్ ఉండాలి కదా కానీ సదరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నవారికి ఒక రూల్స్ లేని వారికి మరొక రూల్స్ చెప్పు వారి యొక్క చేతివాటాన్ని చూపిస్తున్నారు వారు అడిగినంత అందజేస్తే ఎవరైతే అర్జీదారుడు ఉన్నారో వారికి ప్లానింగ్ అప్రూవల్ ఆగ మేఘాల మీద అందుతుంది కానీ ఎవరైనా వారు అడిగినంత ఇవ్వకపోయినా లేదా రూల్స్ ను ప్రశ్నించిన వారి ప్లానింగ్ మాత్రం నెలలు గడుస్తున్న కార్యాలయం నుండి బయటకు రాదు అటు నిర్మాణాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేస్తారు పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు చేతివాటం వలన పట్టణంలో రోడ్లన్నీ ఇరుకు సందులు వలే మారిపోయాయి పెద్ద పెద్ద వాహనాలు వెళ్లాలంటే కొన్ని రోడ్లు వెళ్లలేని పరిస్థితుల్లో పట్టణంలో రోడ్లు తయారయ్యాయి దీనికి ముఖ్య కారకులు టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటాలు అని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు ఏది ఏమైనాప్పటికీ నందిగామ పట్టణంలో నిర్మాణం అవుతున్న నిర్మాణం కోసం అప్రూవ్ పొందిన ప్రతి ఒక్కరికి పట్టణ ప్లానింగ్ వివరాలను అందించి దాని కనుగుణంగా నిర్మాణాలు జరిపితేనే మున్ముందు పట్టణ అభివృద్ధికి దోహదపడతాయి కొన్ని కొన్ని నిర్మాణాల వలన ముఖ్య ఇళ్లకు వెళ్లే రహదారులు సైతం మూసుకు పోయే పరిస్థితులు వస్తున్నాయి ఎన్టీఆర్ రోడ్ లో నిర్మాణం అవుతున్న ఐదు అంతస్తుల భవనానికి రోడ్డు వైండింగ్ కింద మున్సిపాలిటీకి అందించవలసిన స్థలాన్ని ఇవ్వకుండానే వారు నిర్మాణాలు చేస్తున్నారు, ఖుషి కాలేజ్ రోడ్డులో మరో ఐదు అంతస్తుల భవనం అక్రమ నిర్మాణం జరుగుతుంది అదే కాకుండా జి ప్లస్ త్రీ అనుమతి ఉన్న పట్టణంలో ఐదు అంతస్తుల భవనాలు యదేచ్చగా అక్రమ నిర్మాణదారులు నిర్మాణాలు చేస్తున్నారు అంతే కాకుండా నందిగామ శాసనసభ్యురాలు కార్యాలయానికి వెళ్ళే రహదారిలో నిర్మాణం అవుతున్న బిల్డింగ్ రోడ్డుకు అందించ వలసిన స్థలాన్ని అందించ కుండానే నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వారికి పర్మిషన్ లు అందించారు కొన్ని కొన్ని సందర్భాల్లో శాసనసభ్యురాలు కార్యాలయానికి అత్యవసరంగా ముఖ్యులు వస్తున్న సందర్భంలో రోడ్డుపై ఎదురుగా వాహనం వస్తుంటే తప్పుకోలేని పరిస్థితి ఉంది దాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు మరింత బలపరుస్తున్నారు. మున్ముందు రోజుల్లో నందిగామ శాసనసభ్యురాలు కు ప్రత్యేక హోదా లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో నందిగామ శాసనసభ్యురాలు కార్యాలయం నుండి ప్రభుత్వ ఎస్కార్ట్ లు వెళ్ళవలసి ఉంటుంది అనేక పనులు పై కార్యాలయానికి వచ్చేవారు వస్తూపోతూ ఉంటారు వారికి ఇబ్బందులు తప్పే పరిస్థితి లేవని ప్రజలు చెప్పకనే చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం పట్టణంలో పలు రహదారుల ను ఇరుకు సందులు గా మార్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది కొందరు మధ్యవర్తుల ద్వారా టౌన్ ప్లానింగ్ అధికారుల రాయబారాలను ప్రజలు బాహాటంగా పలువురికి విన్నవించుకోవడం ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారింది….
అధికారుల వివరణ :- సదరు విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించడానికి ట్రై చేస్తే వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం విశేషం సదరు మున్సిపల్ కమిషనర్ ను ఇదే విషయంపై గతంలో సంప్రదించగా అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై సంబంధిత శాఖ ద్వారా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు…