Homeఆంధ్రప్రదేశ్మౌలిక సదుపాయాలకు రూ.1052 కోట్లు

మౌలిక సదుపాయాలకు రూ.1052 కోట్లు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమరావతి రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాల సము దాయ ప్రాంతంలోని లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవా లని సీఆర్డీఏ కమిషన్‌ను ఆదే శిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీజేశారు. రూ.1052.67 కోట్ల మంజూరుకు పరిపాలనా అనుమతి జారీజేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. యుటిలిటీ డక్ట్‌లు, పునర్వినియోగ నీటిలైన్‌, అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్మాణం తదితర ఏర్పాట్ల కోసం ఈ నిధులు వెచ్చించాలని స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు