Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

- Advertisement -

. పూర్వ విద్యార్థులు, గురువులు.
విశాలాంధ్ర ధర్మవరం:: కొన్ని సంవత్సరాల కిందట చదువుకొని వివిధ ప్రాంతాలలో వెళ్ళిన వారు, ఒకచోట చేరి తమ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న వైనంలో పూర్వ విద్యార్థులుగా గురువులను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పూర్వ విద్యార్థులు, గురువులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ పిన్ను చెండ్రాయప్ప శ్రేష్ఠి (ఎస్పీసీఎస్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల) లో 1997-2002 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళన సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుత హెడ్మాస్టర్ పద్మావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు గురువులు మాట్లాడుతూ మా వద్ద విద్యను అభ్యసించి వివిధ హోదాలలో, వ్యాపార సంస్థలలో ఉంటూ ఒక అమూల్యమైన రోజుగా ఈ అపూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం అనేది మా జీవితంలో మరిచిపోని రోజు అని వారు తెలిపారు. తదుపరి పాత రోజుల్లో విద్యార్థులతో ఉన్న తీరును వారు గుర్తు తెచ్చుకొని, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము నేర్చుకున్న ఈ పాఠశాల మాకు ఒక మంచి మార్గదర్శకం అయిందని, మా గురువులు యొక్క విద్య ద్వారా, ఆశీస్సుల ద్వారా మా జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లు జరగడం మా పూర్వజన్మ సుకృతం అని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ కాలంలో గురువుల వద్ద విద్యార్థులు చేసిన తీపి గుర్తులను వారు గుర్తు తెచ్చుకొని తమ ఆనందాన్ని వేదిక ద్వారా అందరికీ అందించిన వైనం విశేషంగా ఆకట్టుకుంది అని తెలిపారు. అంతేకాకుండా పాఠశాల ఔన్నత్యాన్ని, అలాగే పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయంగా ఒక కంప్యూటర్, బ్లూటూత్ స్పీకర్ ,మైకు ఇవ్వడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. పూర్వ విద్యార్థులుగా మమ్ములను ప్రయోజకులుగా తీర్చిదిచ్చిన పాఠశాలకు, ఉపాధ్యాయులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని వారు తెలిపారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అవుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు వందమంది విద్యార్థులకు పైగా పూర్వ విద్యార్థులతో పాటు అప్పటి ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు