శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రైల్వే స్టేషన్లో పాడేరు నుంచి పుట్టపర్తి లో సేవ కోసం వెళుతున్న 35 మంది సేవాదళ్ సభ్యులకు పట్టణంలోని శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీనగర్ కన్వీనర్ నామా ప్రసాద్ ఆధ్వర్యంలో భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తికి వెళ్లే సేవాదళ్ సభ్యులుగాని, భక్తాదులు గాని అవసరమైన సమయానికి తమ సేవా సమితి తరపున ఉపహారం, అల్పాహారం, భోజనము లాంటి కార్యక్రమాలను చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, అటువంటి దాతలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టపర్తి సత్యసాయి బాబా ఆశీస్సులతో మున్ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు.
రైల్వే ప్రయాణికులకు భోజనపు ప్యాకెట్లు పంపిణీ..
- Advertisement -
RELATED ARTICLES


