విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గీతా నగర్ లో గల అజయ్ లక్ష్మీ దంపతుల కుమారుడు వెంకట కనిష్క్ (3 సంవత్సరాలు) ఇంటి వద్ద ఆడుకుంటూ పొరపాటున సంపులో పడి మృతి చెందాడు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీసులు మాట్లాడుతూ బాలుడు ఆడుకుంటూ ఇంటి ఆవరణములో ఉన్న నీటి సప్పులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం జరిగిందన్నారు. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు బాలుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించడం జరిగిందన్నారు. బంధువులు, తల్లిదండ్రులు ఈ ఘటన చూచి బోరున వినిపించారు. బాలుని తండ్రి అజయ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇంట్లోని సంపులో పడి బాలుడు మృతి
- Advertisement -
RELATED ARTICLES


