Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న కూలీలను వెంటనే మంజూరు చేయండి..

ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న కూలీలను వెంటనే మంజూరు చేయండి..

- Advertisement -

సిపిఎం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద కూలీగా పని చేస్తున్న వారి కూలీలు కు రావలసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే మంజూరు చేయాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సాయి మనోహర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలని, ఆ కూలీ డబ్బులతోనే కూలీలు తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని వారు గుర్తు చేశారు. పని దినాలు 200 రోజులకు పెంచాలని తెలిపారు. రోజువారి వేతనం 600 రూపాయలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, జాబు కార్డును మంజూరు చేయాలని, కూలీలకు సరిపడే పరికరాలను పంపిణీ చేయాలని, పరికరాల రిపేరీ ఖర్చులు కూడా జమ చేయాలని వారు తెలిపారు. తదుపరి బడనపల్లి నుండి చిగిచెర్ల రోడ్డులోకి రోడ్డును వేయించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెద్దన్న, ఎస్ హెచ్ భాష, ఆదినారాయణ, మారుతి, హైదర్ వలీ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు