Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్వామి వివేకానంద సేవలు చిరస్మరణీయం.. ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్

స్వామి వివేకానంద సేవలు చిరస్మరణీయం.. ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; దేశ సేవకై యువత ఎల్లప్పుడూ ముందు ఉండాలని,దేశ యువతను ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తూ వారిని సన్మార్గంలో వెళ్ళేలా కృషిచేసిన స్వామి వివేకానంద సేవలు చిరస్మరణీయం అని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు వద్దగల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు వివేకానంద వర్థంతి కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. తదుపరి ప్రిన్సిపాల్ తో పాటు విద్యార్థులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వామి వివేకానంద గారి జీవిత విశేషాలను పంచుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్ అధ్యాపకులు కృష్ణయ్య, శ్రీనివాసులు, జయకృష్ణ,శిరీష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు