జాయింట్ కలెక్టర్ శివ నారాయణన్ శర్మ
విశాలాంధ్ర అనంతపురం : సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాదృక్పథాన్నిఅలవర్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చెన్నైకు చెందిన ఫ్రీడమ్ ట్రస్ట్ సంస్థ అధినేత డాక్టర్ సుందర్ మరియు ట్రస్ట్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, సేవేక్స్ టెక్నాలజీస్ సంస్థ అధినేత శ్రీమతి లతా జోషి, ముంబై వారి సౌజన్య సహకారాలతో అర్హులుగా గుర్తించిన 195 మందికి సుమారు రూ .25 లక్షల విలువ కలిగిన కృత్రిమ కాళ్లు మరియు చేతి కర్రలు జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… సమాజంలో ఎంతోమంది నిరుపేదలు వివిధ కారణాలతో విభిన్న ప్రతిభావంతులు గా ఉంటారని అలాంటి వారిని ప్రస్తుత దాతలు మానవతా విలువలతో సేవా దృక్పథంతో ఒక్కొక్క కృత్రిమ కాలు ఖరీదు రూ.12,000/- కలిగిన వాటిని ఉదారభావంగా ఉచితంగా అందజేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని , సాటి మనుషుల కష్టాలను గుర్తించి వారిని తమవంతుగా ఆదుకున్నప్పుడే జీవితానికి ఒక సార్థకత లభిస్తుందని తెలిపారు. ఇలాంటి సేవ తత్పరత కలిగిన వారిని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు పెంపొందించుకోవలసిన అవసరం ఉందని అన్నారు. అనేక ప్రాంతాలలో ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు దాతలను జాయింట్ కలెక్టర్ అభినందించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులకు ఉచిత కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మలోలా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన మరియు విభిన్నప్రతిభావంతుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి…
RELATED ARTICLES