ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు కు ఇంటర్మీడియట్ లో చేరడానికి డిఐఈఓ సయ్యద్ మౌలా ఆదేశాల మేరకు ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడుగిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ బాలికల ప్రిన్సిపాల్ వనిత వాణి, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర కళాశాలలో హెచ్ ఇ సి గ్రూపు, సీఈసీ, బైపీసీ, ఎంపీసీ, ఎమ్మెల్సీ,, సిరికల్చర్ గ్రూపులు కలవని తెలిపారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కూడా బాలురకు కలదని, డిజిటల్ టీచింగ్ కూడా కలదని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే చక్కటి విద్యా బోధన ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 779951668కు సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్, బైపీసీ గ్రూప్, సీఈసీ, హెచ్ఈసి, ఒకేషనల్ గ్రూపులలో ఎంఎల్తిటీ, ఎంపీహెచ్డబ్ల్యూ, పోయే గ్రూపులు కలవని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం తో పాటు ఉచితంగా టెస్ట్ బుక్కులు నోర్సులు బ్యాగు ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9885751908కు సంప్రదించాలని తెలిపారు. కావున తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించి వారి విద్య అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.
ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువు పొడిగింపు..
RELATED ARTICLES