Tuesday, July 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా కొణిజేటి రోశయ్య జయంతి

ఘనంగా కొణిజేటి రోశయ్య జయంతి

ఆంధ్ర ప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి ముడియం రమణ విశాలాంధ్ర అనంతపురం వైశ్య జాతి మణిహారం శ్రీ కొణిజేటి రోశయ్య అని ఆంధ్ర ప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి ముడియం రమణ పేర్కొన్నారు. ముందుగా స్థానిక గుత్తి రోడ్ ఎన్టీఆర్ మార్గంలోని రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి,, గవర్నర్ గా పనిచేసిన శ్రీ కొణిజేటి రోశయ్య 92వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక అనంతపురం ప్రెస్ క్లబ్ నందు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముడియం రమణ మాట్లాడుతూ… రాజకీయరంగంలో తనదైన శైలిలో ముఖ్యమంత్రిగా, గవర్నర్గా రాష్ట్ర ప్రజలకు సేవలు అందజేశారన్నారు. అనంతరం స్వీట్లు పండ్లు పంచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాయలసీమ రీజియన్ చైర్మన్ నగరూరు చంద్ర మహేష్ మరియు మరో ముఖ్య విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి సింధనూర్ నాగరాజు, మరియు ఆర్యవైశ్య నాయకులు భూపాల ప్రభాకర్,ఇల్లూరి సురేష్, మాకం సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు