విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : మొహరం వేడుకలను మండలంలో ప్రశాంతంగా నిర్వహించిన సీఐ మస్తాన్ వలి ని సర్పంచ్ మూలింటి రాధమ్మ భర్త జిల్లా కేడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, టిడిపి మాజీ కన్వీనర్ ఎస్.తిమ్మన్న, ముస్లిం మత పెద్దలు తన్వీర్ అహమ్మద్, మాబుసాబ్, షేక్ సాబ్, రాజసాహెబ్ లు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా సీఐ మస్తాన్ వలి మాట్లాడుతూ మొహరం పండుగ వేడుకల సందర్భంగా ముందుగానే గ్రామాలలో ప్రజలకు మరీ ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలలోనే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల ఏలాంటి గొడవలు జరగలేదన్నారు. తన విధి నిర్వహణలో తనకు సహకరించినటువంటి రాజకీయ పార్టీల నాయకులకు, ముస్లిం మత పెద్దలకు, ప్రజలకు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లింగమ్మ తనయుడు ప్రకాష్, ఎంపీటీసీ తిమ్మప్ప, టిడిపి యువ నాయకులు సతీష్ కుమార్, గ్రామ పెద్దలు దుమ్మ గోవిందప్ప, ఈడిగ రంగస్వామి, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ రంగన్న, ముందడుగు స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్, వార్డ్ సభ్యులు ఆలీభాష, వైకాపా మైనారిటీ సంఘం నాయకులు గఫూర్, నాగేష్, రామిరెడ్డి, నబిసాబ్, చాంద్ బాషా, దావుద్ నరసింహులు యువత పాల్గొన్నారు.