విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణములోని డిజైనర్ నాగరాజు జాతీయ అవార్డు అందుకోనున్నారని డిజైనర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా డిజైనర్ నాగరాజు మాట్లాడుతూ డెవలప్మెంట్ కమిషనర్, హ్యాండ్లూమ్ న్యూఢిల్లీ వారు చేనేత నందు, డిజైన్ డెవలప్మెంట్ నందు, మార్కెట్ నందు జాతీయ అవార్డులను ప్రకటించడం జరిగిందని, ఈ అవార్డులో తనకు జాతీయ అవార్డు లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 19 అవార్డులను ప్రకటించగా, మన ఆంధ్రప్రదేశ్ నకు మూడు అవార్డులు లభించాయి అని తెలిపారు. గతంలో రాష్ట్రస్థాయి అవార్డులను ఎన్నో అందుకొని గవర్నర్ రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్న తాను ఆగస్టు నెల 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొదటిసారి జాతీయ అవార్డు రావడం, అదేవిధంగా డిజైన్ డెవలప్మెంట్ నందు మొదటిసారి ఆంధ్రప్రదేశ్కు ఈ అవార్డు రావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం చేనేత కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ అవార్డు అందుకోనున్న ధర్మవరం డిజైనర్ నాగరాజు
- Advertisement -
RELATED ARTICLES


