Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టమును అమలు చేయడమే మా లక్ష్యం.. ఆర్డీవో మహేష్

సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టమును అమలు చేయడమే మా లక్ష్యం.. ఆర్డీవో మహేష్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; రెవెన్యూ డివిజన్లో సీనియర్ సిటిజెన్ల సంక్షేమ చట్టమును అమలు చేయడమే మా లక్ష్యము అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం మా కార్యాలయానికి ఆరు ఫిర్యాదులు అందడం జరిగిందని, వాటిని విచారణ చేస్తున్నామని, త్వరలో న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని కొత్తపేటకు చెందిన 70 సంవత్సరాల గాజుల వెంకట లక్ష్మమ్మను, మనవడు గాజుల అనిల్ కుమార్ బాగోగులు చూసుకోకుండా ఆమె ఆస్తిని రాపిచ్చుకోవడం జరిగింది అని తెలిపారు. ఫిబ్రవరి నెలలో గాజుల వెంకట లక్ష్మమ్మ ఫిర్యాదు ఇవ్వడంతో ఇరువురు మధ్య చట్టపరంగా విచారణ జరిపి మనవడికి మూడుసార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో సీనియర్ సిటిజన్ నిర్వహణ సంక్షేమ చట్టం 2007 కింద తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, రక్షణ పై బాధ్యత వహించాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా నానమ్మ బాగోగులు చూసుకోకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో, చివరకు నానమ్మ అయిన గాజుల వెంకట లక్ష్మమ్మ ఆస్తిని తిరిగి ఈమెకే చెందినట్లు తీర్పుని ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. చట్ట ప్రకారం గాజుల వెంకట లక్ష్మమ్మ న్యాయవాది ద్వారా తన పోరాటాన్ని కొనసాగించిందని తెలిపారు. గాజుల వెంకట లక్ష్మమ్మ భర్త కీర్తిశేషులు గాజుల తిప్పన్న మృతి చెందిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు కేవలం పెన్షన్తో ఉండగా, తదుపరి అనారోగ్యంతో బాధపడుతుందో సీనియర్ సిటిజెన్ల సంక్షేమ చట్టం ప్రకారం ఈమెకు న్యాయం చేకూర్చడం జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు రెవెన్యూ డివిజన్లో ఎక్కడైనా జరిగితే నేరుగా మా ఆర్డీవో కార్యాలయంలో వయోవృద్ధులు గాని తల్లిదండ్రులు గాని ఫిర్యాదు చేయవచ్చునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఓ- ఖతిజూన్ కుప్రా, బాధితురాలు తరఫున న్యాయవాది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు