Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత

పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత

- Advertisement -

కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు కళాశాల ఆవరణలో 30 మొక్కలు నాటి వాటిని విద్యార్థులు దత్తత తీసుకున్నారని కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పర్యావరణం పట్ల విద్యార్థులకు మరింత అవగాహన కల్పించాలని అందుకోసం చిన్న అవకాశాన్ని కూడా తాము వదులుకోవట్లేదని, ఇందులో భాగంగా నానాటికి పెరుగుతున్న కాలుష్యానికి చెట్లు విరుగుడుగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు