Homeఅంతర్జాతీయంపాక్‌లో రెచ్చిపోయిన తీవ్రవాదులు

పాక్‌లో రెచ్చిపోయిన తీవ్రవాదులు

- Advertisement -

బలూచిస్థాన్‌లో ఆపరేషన్‌ బామ్‌ 17 లక్ష్యాలు ధ్వంసం
పెషావర్‌: పాకిస్థాన్‌లో తీవ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. హింసకు దిగారు. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ కేంద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ఆపరేషన్‌ బామ్‌ చేపట్టింది. ప్రభుత్వ, సైనిక కార్యాలయాలపై దాడులు చేసింది. 17 లక్ష్యాలను ధ్వంసం చేసింది. అదే విధంగా స్థానిక జోబ్‌ ప్రాంతంలోని జాతీయ రహదారిపై బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దించి కాల్చివేసిన ఘటన చోటుచేసుకుంది. కాగా, పంజ్‌గూర్‌, సురాబ్‌, కెచ్‌, ఖరాన్‌ వంటి ప్రాంతాలతో సహా అనేక జిల్లాల్లో దాడులు బీఎల్‌ఎఫ్‌ చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి మేజర్‌ గ్వహరామ్‌ బలూచ్‌ ఒక ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్‌… బలూచ్‌ విముక్తి పోరాటంలో కొత్త దశగా వర్ణించారు. తమ కార్యకలాపాలు మక్రాన్‌ తీరం నుంచి కోప్‌ా-ఎ-సులేమాన్‌ పర్వతాల వరకు విస్తరించాయన్నారు. ఈ దాడులు తమ సామర్థ్యాన్ని తెలియజేస్తాయన్నారు. ఆపరేషన్‌ బామ్‌ వల్ల కమ్యూనికేషన్‌ లైన్లు దెబ్బతిన్నాయి. పరిపాలనా మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. సైనిక చెక్‌ పోస్టులు ధ్వంసం అయ్యాయి.
9 మంది బస్సు ప్రయాణికుల కాల్చివేత
బలూచిస్తాన్‌లోని ఓ బస్సుపై తీవ్రవాదులు దాడి చేశారు. ప్రయాణికుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మరీ వారిని బస్సులో నుంచి కిందకు దించి కాల్చిచంపారు. క్వెట్టా నుంచి లాహోర్‌ వెళ్తున్న తొమ్మిది మందిని కాల్చేశారని, మృతులంతా పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు