Friday, January 16, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాదయాత్ర

ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాదయాత్ర

- Advertisement -

వైసీపీ కుప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మారిన మంత్రిగారి ప్రజాహిత పాలన —- పరిటాల శ్రీరామ్..

పదవులకోసం కాదు, ప్రజల సేవకోసం కూటమి పాదయాత్ర. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
—- చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్, తన పాలనకు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలో ప్రజల మధ్య పాదయాత్రను ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ , జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కలిసి పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కస్వామి నగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థించిన 7వ వార్డు తిక్కస్వామినగర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
ఇతర ఎన్డీఏ కూటమి నేతలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్న నేతల ఐక్యత ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. 6 వార్డుల్లోని ప్రజల గడప గడపకూ వెళ్లిన ఎన్డీఏ నాయకులు శివనగర్, సంజయ్ నగర్, గాంధీనగర్, ఇందిరానగర్, పిఆర్‌టి వీధిలలో – ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. పెండింగ్ సమస్యలపై తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పాదయాత్రలో ప్రజలు పేర్కొన్న ప్రధాన సమస్యలు ; మురికి కాలువల శుభ్రత, కాలువల నిర్మాణం,
పాడైపోయిన సీసీ రోడ్ల పునర్నిర్మాణం, తాగునీటి సరఫరాలో లోపాలు, పాడైపోయిన విద్యుత్ స్తంభాల మూలంగా ఏర్పడిన సమస్యలు, ముఖ్యంగా చేనేత కార్మికుల విద్యుత్ సమస్యలు, కొత్త విద్యుత్ స్తంభాల అవసరం,
వితంతువుల పెన్షన్, వృద్ధాప్య, అంగవైకల్య పెన్షన్లు,
ప్రధాన రహదారుల్లో కల్వర్టుల నిర్మాణం,
ఆరోగ్య సేవల లోపాలు, ఈ అంశాలన్నింటిపై మంత్రి ప్రత్యక్షంగా స్పందించారు. తక్షణమే అధికారులతో మాట్లాడి, పరిష్కార మార్గాలను సూచించడంతో పాటు తన కార్యాలయ సిబ్బందిని చర్యలు పర్యవేక్షించేందుకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజల జీవితాల్లో మార్పు ప్రారంభమైంది అని, అరాచక పాలనకు తెరదించి, అభివృద్ధి – సంక్షేమాన్ని సమంగా తీసుకొస్తున్నాం అని తెలిపారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించడమే మా బాధ్యత అన్నారు. ధర్మవరం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో నిరంతర కృషి చేస్తానుఅని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 110 కోట్ల రూపాయలతో విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రణాళిక ప్రభుత్వానికి సమర్పించబడింది అని, రూ. 9 కోట్లతో ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా రోడ్లు, కాలువల అభివృద్ధి పనులు ప్రారంభించబడ్డాయి అని తెలిపారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని డీసిల్టింగ్, మురుగు నీటి కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎక్స్‌టెండెడ్ ఏరియాల్లో విద్యుత్, రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ – గత ప్రభుత్వ పాలనలో పట్టణ అభివృద్ధికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అని, మంత్రి నాయకత్వంలో మళ్లీ ప్రజల విశ్వాసం తెచ్చుకున్నాం అని తెలిపారు. ప్రజల ఇంటి వద్దకే పాలనను తీసుకెళ్లిన ఈ పాదయాత్ర ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అని అన్నారు. తదనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ – కూటమిగా పనిచేసే మన లక్ష్యం ఒక్కటే – ప్రజలకు మేలు,మంత్రి చేసిన ఈ పాదయాత్ర ద్వారా ప్రజల మనస్సుల్లో మళ్లీ విశ్వాసం నాటబడింది అని తెలిపారు. ప్రజల సమస్యలపై గంభీరంగా స్పందిస్తున్న నేతలతో రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్ర, మండలాల అధ్యక్షులు చంద్ర, రాము, భాస్కర, ఓబులేష్, టిడిపి పట్టణ అధ్యక్షులు సుధాకర్, ఏపీ సీడ్స్ డైరెక్టర్ కమతం కాటమయ్య, మహేష్ చౌదరి, నరేంద్ర, ఫణి కుమార్, జనసేన నాయకులు రాజారెడ్డి, శ్యామ్ , డిష్ రాజు, ఎన్డీఏ కూటమి మహిళా నాయకురాలు, మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు