ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కేబి నాగార్జున రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు 74 వ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని ముఖ్యఅతిథి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కేబి. నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి జే. ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి వారు ఎంప్లాయిస్ యూనియన్ గొప్పతనాన్ని తెలియజేస్తూ యూనియన్ కార్మికుల శ్రేయస్సుల కోసం చేసిన పోరాటాలను సాధించిన విజయాలను గూర్చి వివరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉద్యోగుల శ్రేయస్సు కోసం యూనియన్ ఎటువంటి ఉద్యమాలకు పులుపునిచ్చిన ప్రతి ఒక్కరూ సన్నద్ధమై ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రీజినల్ నాయకులు నరసింహులు, బిల్లే ఆదినారాయణ, ఎడిసి మల్లికార్జున, డిపో అధ్యక్షులు తిరుమలేష్, గ్యారేజీ కార్యదర్శి మల్లికార్జున, నాయకులు కుమార్, వలి, నజీర్ సాబ్ ,సుమోసిన, బాబు, రామకృష్ణ ,శంకర్, రిటైర్డ్ అసోసియేషన్ నాయకులు ఈశ్వరయ్య, సూరీడు, మిల్ట్రీ నరసింహులు తోపాటు అధిక సంఖ్యలో ఉద్యోగ సోదర, సోదరీమణులు హాజరై విజయవంతం చేశారు.
ఘనంగా 74వ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
- Advertisement -
RELATED ARTICLES


