ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;; శ్రీ సత్య సాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో తాగునీటి సరఫరా కార్మికులకు పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో త్వరలోనే ఆ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేపడతామని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత పది నెలలుగా బకాయి పడ్డ తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, గత మూడు రోజుల నుంచి ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు సమ్మె చేస్తున్న తరుణంలో సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అని తెలిపారు. మండల వ్యాప్తంగా సత్యసాయి నీటి సరఫరా విభాగంలో 30 మంది, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 14 మంది మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు అని, ఈ మేరకు వారికిచ్చే అరకొర జీతాలు కూడా సకాలంలో ఇవ్వకుండా నెలలు తరబడి పెండింగ్ పెడుతుండడం దారుణం కాదా అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు.
ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు పది నెలల జీతాలు సత్యసాయి కార్మికులకు నాలుగు నెలల జీతాలు పెండింగ్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల కు గత పది నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా బాధాకరమని తెలిపారు. జీతాలు చెల్లించాలని అనేకసార్లు అధికారులను అడుగుతున్న వారు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక ఆ కార్మికులు గత మూడు రోజులుగా విధులకు వెళ్ళకుండా సమ్మె బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కార్మికులకు న్యాయాన్ని చేకూర్చవలసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టినట్లు ఉండడం సరైన పద్ధతి కాదు అని వారు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకు కార్మికులు తరచూ ఆందోళనలు చేస్తూ తమ వేతనాలను దక్కించుకోవాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు, గతంలో కూడా నీటి సరఫరా కార్మికులకు జీతాలు చెల్లింపుల విషయమై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పలమార్లు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. కనుక ఇప్పటికైనా తక్షణమే కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించి, వారు విధులకు వెళ్లే విధంగా చర్యలు తీసుకొని తద్వారా మండలంలో తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. లేని పక్షంలో కార్మికులతో కలిసి త్వరలోనే ముదిగుబ్బలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా
ముఖ్యమంత్రిని కలవకుండా కార్మికుల ముందస్తు అరెస్టు దారుణం అన్నారు.
ఇదిలా ఉండగా గురువారం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు
తమ జీతాలు విషయం విన్నవించడానికి నీటి సరఫరా కార్మికులు సీఎంను కలుస్తారనే సమాచారంతో ముదిగుబ్బ పోలీసులు గురువారం ఉదయమే ఆ కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని ముందస్తు అరెస్టులు చేసి వారు ముఖ్యమంత్రిని కలవకుండా అడ్డుకోవడం పద్ధతేనా అని వారు ప్రశ్నించారు.. ఇది ప్రజాస్వామ్య దేశమని, ప్రజలు సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు అని వారు తెలిపారు.
తాగునీటి సరఫరా కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించకపోతే రాస్తారోకో చేస్తాం..
- Advertisement -
RELATED ARTICLES


