Homeజిల్లాలుఅనంతపురం“ప్రణాళిక బద్దమైన కుటుంబం శ్రేయస్కరం “ డి ఎం అండ్ హెచ్ ఓ డా.ఈ.బీ.దేవి

“ప్రణాళిక బద్దమైన కుటుంబం శ్రేయస్కరం “ డి ఎం అండ్ హెచ్ ఓ డా.ఈ.బీ.దేవి

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం : ప్రణాళిక బద్దమైన కుటుంబం శ్రేయస్కరం అని డి ఎం అండ్ హెచ్ ఓ డా.ఈ.బీ.దేవి పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది ,
ఈ కార్యక్రమం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము జూలై 11, వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భముగా వివిధ ప్రచార కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సంవత్సరం థీమ్ , “ప్రణాళిక బద్ధమైన మాతృత్వం కోసం, గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం మరియు అంతరం, అవసరమని ప్రజలలోకి తీసుకెళ్లడానికి , వివిధ ప్రచార కార్యక్రమాలు, జిల్లా వ్యాప్తంగా, బ్యానర్లు, పోస్టర్లు మరియు మీడియా ఉపయోగించి జిల్లా వ్యాప్తంగా వారం రోజులపాటు జరుపుకోవడం జరుగుతుందన్నారు.
ప్రస్తుతము యువ జనాభా సంఖ్య తగ్గుతున్న కారణంగా ప్రతి ఒక్క దంపతులు , తప్పనిసరిగా సంతానాన్ని పొందాలని తద్వారా ఆరోగ్యవంతమైన యువ జనాలు పెరిగి దేశానికి అవసరమగు పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
అంతేకాక బాల్యవివాహాలు పూర్తిగా అరికట్టాలని దంపతులు ప్రణాళిక బద్ధమైన మాతృత్వం కోసం, గర్భదారుల మధ్య ఆరోగ్యకరమైన సమయం మరియు అందరం పాటించాలని తద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. క్రమబద్ధమైన గర్భవతుల పరీక్షలు, పోషకాహారం ,ఆస్పత్రి ప్రసవాలు, నవజాతశిశు సంరక్షణ, తల్లిపాలు అనుబంద ఆహారం వంటి వాటి ఆవశ్యకతను తల్లులకు తెలియజేసి మాతృ శిశు మరణాలు అరికట్టడానికి ఆరోగ్య సిబ్బంది దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లాలో,
ముగ్గురు పిల్లలు కలిగిన దంపతులకు లాటరీ ద్వారా, ఎంపిక చేసి వారికి, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతి పాటించిన వారికి ఇద్దరికీ చొప్పునరూ 5 వేలు , కుటుంబ నియంత్రణ శ్వాసత పద్ధతులు చేసుకున్న వారికి ఒక్కరికి రూ.5 వేలు , గైనకాలజిస్ట్ కు రూ 8 వేలు. ఏ యన్ యం లకు ,యం ఎల్ హెచ్ పి లకు ,ఆశాలకు ,ఆర్ యం ఎన్ సి ఎస్ కౌన్సిలర్స్ లకు ఒకొక్కరికి 2,500 పారితోషికం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ మహ్మద్ రఫీ , ఎచ్ ఈ ఈ ఓ నాగరాజు,డెమో త్యాగరాజు , డిప్యూటీ ఎచ్ ఈ ఓ గంగాధర్ ,పి యం ఓ నాగన్న ,సునీల్ ,లక్ష్మీనరసమ్మ, వేణు ,వెంకటేష్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు