సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటూరి నాగేశ్వరరావు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : పేదరికం లేని సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామంలో జరిగిన “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ పెంపుదల, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లి వందనం వంటి సంక్షేమ పథకాల అమలుపై ప్రజల స్పందనను సేకరించారు. ఇంకా ఎవరికైనా పథకాలు అందకపోతే, వారి వివరాలు సిద్ధం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అలాగే, ప్రభుత్వ పాలనకు సంబంధించిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను కూడా ప్రజలకు పంపిణీ చేశారు. అందులో ఒక్కో పథకం యొక్క లబ్ధిదారులు, లబ్ధి విధానం, పథకాల అమలుపై తాత్కాలిక సమాచారం ఉండేలా రూపొందించారు.
ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.
గతంలో ఒక అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. జగన్ పాలన రాష్ట్రాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం అమరావతి, పోలవరం, పరిశ్రమల ప్రోత్సాహం వంటి రంగాల్లో అభివృద్ధి ఊపందుకుందని అన్నారు.
ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
తల్లి వందనం ద్వారా పిల్లల సంఖ్యను బట్టి మాతృదేవతలకు గౌరవం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన భోజనం..
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం..
రైతులకు పెట్టుబడి సహాయం కోసం అన్నదాత సుఖీభవ పునరుద్ధరణ..
ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది… సంక్షేమం, అభివృద్ధి రెండూ సమన్వయంతో నడిపించగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఇంటూరి నాగేశ్వరరావు గారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గారికి ప్రతి నాయకులు మహిళలు ఘన స్వాగతం పలికారు..
ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షులు చొప్పర రాఘవులు, పార్టీ నాయకులు, చెరువుపల్లి మాల్యాద్రి, చొప్పర బ్రహ్మయ్య, చెరువుపల్లి సాంబయ్య, బొమ్మినేని రమేష్. కామినేని అశోక్, కాకుమాని హర్ష, ముతకని వెంకట్రావు, జల్లి మధు, చుండి మాల్యాద్రి, కామినేని అనిల్, మేకల అశోక్, చెరువుపల్లి అశోక్, చొప్పర వసంతరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..