Sunday, July 20, 2025
Homeజిల్లాలుఅనంతపురంమెడికల్ కళాశాలలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

మెడికల్ కళాశాలలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

ప్లాస్టిక్ వాడకంతో చాలా అనర్ధాలు

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా
విశాలాంధ్ర అనంతపురం : నెలలోని ప్రతి మూడో శనివారం ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ షారోన్ సోనియా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021, 2022 బ్యాచ్ వైద్య విద్యార్థులకు బీట్ ప్లాస్టిక్ అనే థీమ్ పై పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను ప్రిన్సిపాల్ సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా మాట్లాడుతూ మన దిన చర్యలో భాగంగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణం కలుషితమై ప్రకృతి కి, జీవాలకు చాలా నష్టం వాటిల్లుతుందని తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రతి వైద్య విద్యార్థి పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించడం, మన తోటి వారికి కూడా తెలియజెప్పడం భాధ్యత అని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వైద్య విద్యార్థులు అభినవ్, అమృత, రుకియా అంజుమ్, భువనేష్, హర్ష శ్రీ విష్ణు, శశాంక్, యామిని ప్రియ, ముక్త శ్రీ, శ్రీ సాయి, గాయత్రి, సాహితి, సాయి శ్రీ లాస్య లకు ప్రశంస పత్రాన్ని మెడల్స్ ను ప్రిన్సిపాల్ డాక్టర్ షారన్ సోనియా అందించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ శంషాద్ బేగం, ఆచార్య డాక్టర్ శంకర్, సాస నోడల్ ఆఫీసర్ ఆచార్య డాక్టర్ శివ శంకర్ నాయక్, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్లు డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, నరసింహ నాయక్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆచార్య డాక్టర్ వాల్మీకి శ్రీనివాస్, సీనియర్ ప్రొఫెసర్లు ఆచార్య డాక్టర్ సరళ, ఆచార్య డాక్టర్ శాంతిరెడ్డి, ఆచార్య డాక్టర్ దుర్గ, డాక్టర్ పద్మ శ్రావణి, డాక్టర్ భవాని, డాక్టర్ సుమన్ కుమార్, డాక్టర్ నీరజ, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ సరోజ, డాక్టర్ హైమావతి, డాక్టర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు