విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని వంశీకృష్ణ నోబెల్ స్కూల్ లో గో గ్రీన్ గో క్లీన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రీప్రైమరీ నుండి రెండవతరగతి విద్యార్థులకు గ్రీన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మెన్ బిరే గోపాలకృష్ణ మాట్లాడుతూ “గ్రీన్ కలర్ కు ఉన్న ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు.”అలాగే పాఠశాల కరెస్పాండంట్ వంశీకృష్ణగారు పిల్లలకు మన జీవన కాలంలో పచ్చదనం,కూరగాయలు మరియు మొక్కలు యొక్క ప్రాముఖ్యతను వివరించారు.చెట్లను నాటి పచ్చదనాన్ని మరింత పెంచాలి అని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పిల్లలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి వివిధ ఆకుపచ్చ వస్తువులను ప్రదర్శించి వాటి ఉపయోగాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరక్టర్ శిరీష గారు, ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ రెడ్డి ,డీన్ పోతలయ్య, మారుతి ఉపాద్యాయులు పాల్గొన్నారు.
వంశీకృష్ణ నోబెల్ స్కూల్ లో ఆకట్టుకున్న గ్రీన్ డే వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


