Homeజిల్లాలుఅనంతపురంరుద్రంపల్లి లో గుప్తనిధుల తవ్వకాలు..!!

రుద్రంపల్లి లో గుప్తనిధుల తవ్వకాలు..!!

- Advertisement -

12 మంది అంతరాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.రాజుల కాలం నాటి బంగారు నాణేలు, ఇత్తడి, వెండి ఆభరణాలు ఉన్నాయని ఆశపడి గుట్ట నిధుల కోసం తవ్వకాలు సాగించిన 12 మంది వేటగాళ్లు పోలీసుల ఉచ్చు లో పడ్డారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామ సమీపంలోని బిసలమల్లప్ప గుడి వద్ద శనివారం అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు గుప్త నిధుల కోసం జెసిబి తో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మూడు చిన్న ఇత్తడి, ఒక ఇత్తడి గంట లభ్యమైనట్లు తెలిసింది. ఈ సమాచారం పోలీసులకు రావడంతో గుప్తనిధుల వేటగాళ్లను గాలించి పట్టుకున్నారు. వీరి నుంచి ఒక జెసిబి, రెండు కార్లు, నాలుగు మోటర్ సైకిల్లు , ఒక గుణపం, ఒక గుద్దెలి , ఒక చెట్లను తవ్వే గడ్డపారలు, రెండు పారలు స్వాధీనం చేసుకొని గుప్త నిధులను కూడా సీజ్ చేశారు . పోలీసులకు పట్టుబడిన నిందితులంతా కేరళ, అనంతపురం, కంబదూరు, కుందుర్పి మండలశీ రుద్రంపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో రుద్రంపల్లికి చెందిన నాగభూషణ, బొమ్మన్న , పసుపుల మంజునాథ్, అనంతపురం పట్టణానికి చెందిన సయ్యద్ ఆశ్రఫ్, తలారి సుబ్బరాయుడు , వెంకటేష్, కేరళ రాష్ట్రానికి చెందిన నిజాముద్దీన్, అసలుద్దీన్, నౌషాద్, అనంతపురం పట్టణానికి చెందిన షేక్ ఫరూక్ భాష, కంబదూరు మండల కేంద్రానికి చెందిన, షేక్ షఫీ, ఎస్. మహమ్మద్ లు ఉన్నారని కుందుర్పి ఎస్సై జి.నగేష్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు