సీపీఐ 24వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి … పీ రామచంద్రయ్య
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్టు మీటర్లుకు వ్యతిరేఖంగా వామపక్షపార్టీల ఆద్వర్యంలో ఆగస్టు 5న జరుగు ఆందోళనలను విజయవంతం చేయాలని , ఆగస్టు 9,10 తేదీలలో జరుగు సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ రామచంద్రయ్య పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మంగళవారం సీఆర్ భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విరూపాక్షి అద్యక్షతన జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొదట సీపీఐ నగర కార్యదర్శి ఎస్ మునెప్ప ప్రవేశపెట్టి సంతాపతీర్మాణంకు సభ్యులు రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలియచేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామచంద్రయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్మార్ట్‌మీటర్ల వ్యతిరేఖించడమే కాకుండా పగుల కొట్టాలని చెప్పారని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు.రైతులకు అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సుప్రయాణం, మహిళ అకౌంట్‌లలో నెలకు 1500రూ ఇస్తానని రకరకాల హామీ ఇచ్చి ఏది కాలమైన ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రైతులు పండిరచిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు విఫలం చెందారన్నారు. జిల్లా మహాసభల సందర్భంగా ఆగస్టు 9న కర్నూల నగరంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహి ంచడం జరుగుతుందన్నారు ఈ ప్రదర్శనలో అగ్రబాగాన రెడ్‌షర్టు వాలెంటీర్లు, ఎర్రచీరలు ధరించిన మహిళలు అగ్రబాగన నిలుస్తారన్నారు. ప్రదర్శనలో ముందు బాగాన వివిధ రూపాలలో ఉన్న కళారూపాయలు , ప్రజానాట్యమండలి కళాకారుల గేయాలు, డప్పుచప్పుళ్ళతో పట్టణం నినాదాలతో మారుమోటాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, ఆహ్వానసంఘం అద్యక్షులు కె జగన్నాధంలు మాట్లాడుతూ మహాసభల సందర్భంగా పట్టణం మొత్తం ఎర్రజెండాలు, తోరణాలతో ఎరుపుమయం చేయడమే కాకుండా ప్రదర్శనలో కదంతొక్కాలన్నారు. మహాసభల విజయవంతంకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఆగస్టులో ఒంగోలు పట్టణంలో జరుగు సీపీఐ రాష్ట్ర మహాసభలకు బారీ ఎత్తున కర్నూలు జిల్లా నుండి సీపీఐ శ్రేణులు తరలివెళ్ళాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్, నక్కిలెనిన్‌బాబు,సీపీఐ సీనియర్ నాయకులు పీ భీమలింగప్ప, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్‌మాణిక్యంతోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, సభ్యులు , ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆగస్టు 5న వామపక్ష పార్టీల ఆద్వర్యంలో ఆందోళనలు
- Advertisement -
RELATED ARTICLES


