చేనేత ఐక్యవేదిక సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీన ఉదయం 10 గంటలకు పట్టణంలోని కదిరి గేటు వద్ద గల నేతన్న విగ్రహం వద్ద జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామని చేనేత ఐక్యవేదిక నాయకులు దాసరి శ్రీరాములు, సంకారపు జయశ్రీ, గిర్రాజు రవి, యుగంధర్, పోలా వెంకటనారాయణ తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏడవ తేదీని అధికార పూర్వకంగా చేనేత దినోత్సవంగా ప్రకటించడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించి మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా ప్రత్యేక శ్రద్ధను ఘనపరచడం జరిగిందని తెలిపారు. దేశస్థాయిలో జాతీయ చేనేత దినోత్సవం గా నిర్వహించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. చేనేతలందరూ ఐక్యతను చాటుకునే రోజుగా భావించి పట్టణంలోని చేనేత కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. అంతేకాకుండా సీనియర్ చేనేత కార్మికులకు (మహిళలు, పురుషులు) చేనేత దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించే కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. పట్టు చేనేత దినోత్సవంను పండుగ దినముగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలని వారు తెలిపారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందాం..
- Advertisement -
RELATED ARTICLES


