సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
విశాలాంధ్ర బ్యూరో -తిరుపతి:ప్రపంచ దేశాలు అవలంబిస్తున్న యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు.సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఇస్కఫ్) అభ్యుదయ వేదిక (ప్రోగ్రెసివ్ ఫోరమ్) ఆధ్వర్యంలో హిరోషిమా నాగసాకి డే సందర్భంగా తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో రామచంద్రయ్య, డాక్టర్ ప్రసాద్ అధ్యక్షతన సమావేశం శనివారం ఉదయం నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ రెండవ ప్రపంచం లో హిరోషిమా నాగసాకి పై జరిగిన బాంబుల దాడిలో దాదాపు 1.80 లక్షల మంది చనిపోయారు అన్నారు.ఆ సందర్భంగా ఉపయోగించిన అణ్వాయుధాల మానవాళికి పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు.ఆయుధాలు అభివృద్ధి కి ఉపయోగ పడాలి తప్ప వినాశనానికి ఉపయోగ పడేది గా ఉండకూడదు అన్నారు. నార్త్ కొరియా అధ్యక్షుడు ఏకచక్రాధిపత్యం గా వ్యవహరించారన్నారు.ప్రపంచాన్ని 18 సార్లు నాశనం చేసే ఆయుధాలు ఉన్నా సోవియట్ రష్యా మరో దేశం పై దాడి చేయదన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఆయుధాలు సమకూర్చుకున్న క్రమంలో శత్రువుల పై కాకుండా ప్రజలపై యుద్ధం చేయడం దారుణం అన్నారు.అమెరికాకు కావలసిన వస్తువులు,చిలి దేశం నుండి కావాలి కాబట్టి ఆ దేశం పై అమెరికా దాడి చేసిందన్నారు.
కొన్ని దేశాల్లో ఉన్న సంపదను కొల్ల గొట్టడం కోసమే దాడులు చేస్తున్నారని అన్నారు.విలువైన సంపదను కొనుగోలు చేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోందని. లేకుంటే దాడులు చేస్తోందన్నారు.ఆర్థిక పరమైన యుద్ధాలు గా వస్తుండడం దురదృష్టం అన్నారు. ప్రధాని మోడీ వచ్చాక ఇజ్రాయెల్ తో సంబంధం పెట్టుకొని,ఇజ్రాయిల్ అమెరికాతో బాగా వుంటుంది కాబట్టి ప్రతి యుద్ధం వెనుక ఆర్థిక దోపిడి జరుగుతోందన్నారు. టెర్రరిస్టు లను అంతమొందించాలి కానీ పాకిస్తాన్ ప్రజల పై కాదు అని సిపిఐ గా చెబితే విమర్శలు చేశారన్నారు,అదే ట్రంప్ ఆదేశిస్తే యుద్ధం వెంటనే ఎందుకు ఆపేశారని నారాయణ ఎద్దేవా చేశారు.50 శాతం మన దేశం పై ట్యాక్స్ లు వేశారన్నారు.ఇష్టం లేని వస్తువులు దిగుమతి చేసుకోవాలని ఆంక్షలు విధిస్తున్నారు అని పేర్కొన్నారు.న్యూక్లియర్ వెపన్స్ వద్దు,అణుబాంబులు వద్దు అంటూ కమ్యూనిస్టు పార్టీ పిలునిచ్చిందని దీనిపై ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలి అని కోరారు.అనంతరం అభ్యుదయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రమణ మాట్లాడుతూ అమెరికా యుద్దొన్మాదాన్ని ఎండగట్టాలన్నారు.ప్రపంపంచం లో అనేక దేశాలకు అమెరికా ఆయుధాలు సరఫరా చేసి యుద్ధాలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచ వినాశనానికి అమెరికా ఆజ్యం పోస్తుందని పేర్కొన్నారు. ఇజ్యాయిల్ ఉక్రెయిన్ యుద్ధం లో వేలాది మంది మరణించారు అన్నారు.సిపిఐ సీనియర్ నాయకులు తులసేంద్ర మాట్లాడుతూ ఇటలీ,ఫ్రాన్స్ వంటి దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ అధికారం లోకి రావడంతో దీన్ని అణిచివేయాలని సామ్రాజ్య వాద దేశాలు ఉక్కుపాదం మోపిందన్నారు.హిట్లర్ అధికారం లోకి వచ్చాక నియంతలా వ్యవహరించారన్నారు.
ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి,జిల్లా కార్యదర్శి పి మురళి, ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్, జిల్లా కార్యదర్శి గోవింద స్వామి తదితరులు పాల్గొన్నారు


