కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల అరెస్టును ఖండి0చిన నరహరశెట్టి నరసింహారావు విశాలాంధ్రవిజయవాడ: దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు ఎలక్షన్ కమిషన్ సహాయ సహకారాలతో వేలాది దొంగ ఓట్లను చేర్పించడం బలమైన ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించడం బిజెపి ఎన్నికల్లో గెలుపొందడం ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు గమనించారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. పార్టీ అధినాయకులు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఏపీసిసి ,నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నవంబర్లో బీహార్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో 52 లక్షల ఓట్లను తొలగిస్తామని ముందుగానే ప్రకటించి 72 లక్షల ఓట్లను తొలగించడం దేశ చరిత్రలో విడ్డూరం రాజ్యాంగ వ్యతిరేకానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇండియా బ్లాక్ లోని అనేక పార్టీల నేతలు ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని జాతీయ ఎలక్షన్ కమిషన్ కు వినతి పత్రాన్ని సమర్పించేందుకు వెళుతున్న వారిని అక్రమ అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వి.గురునాథం, సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మీసాల రాజేశ్వరరావు, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అన్సారి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కండెల వరప్రసాద్, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండిహెచ్ఎస్ బేక్, సిటీ లీగల్ సెల్ చైర్మన్ శీలం లెనిన్, నగర వర్తక వాణిజ్య చైర్మన్ కుసుమంచి గణేష్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మండేపూడి సునీత, కాపు సెల్ చైర్మన్ అల్లం రాజేష్, సీనియర్ నాయకులు నేలపాటి సుభాష్ పరుశురాం, షరీఫ్, దమ్ము రాజు, గోపికృష్ణ, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది రాజకీయ పోరాటం కాదు రాజ్యాంగా పరిరక్షణ పోరాటం
- Advertisement -
RELATED ARTICLES


