Homeఈసీపై సమరం

ఈసీపై సమరం

- Advertisement -

ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా

పార్లమెంటు ఎదుటే ప్రజాస్వామ్యం ఖూనీ

. అన్ని కుట్రలు బయట పెడతాం
. ‘ఇండియా’ ఎంపీల ఆగ్రహం
. ఈసీ భవన్‌ వరకు ‘ఓట్‌ చోరి’ మార్చ్‌
. అడ్డుకున్న పోలీసులు
. బారికేడ్లు ఎక్కిన మహిళా నేతలు
. రోడ్డుపై బైఠాయించి నిరసన`అరెస్టులు

న్యూదిల్లీ : మాది ‘పరిరక్షణ’ పోరు… ఓటు హక్కు కాపాడటమే లక్ష్యం… ఎన్ని కల మోసాలను క్షమించం అంటూ ప్రతిపక్ష ‘ఇండియా’ ఎంపీలు నినదిం చారు. పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం ‘నిర్వచన్‌ భవన్‌’కు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ నాయక త్వంలో 300 మంది ప్రతిపక్ష ఎంపీలు కదం తొక్కారు. బీజేపీకి, ఈసీఐకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘ఎస్‌ఐర్‌: ప్రజాస్వామిక హక్కుల దోపిడీ’ బ్యానర్లు, ‘ఓట్‌ చోరీ’ అని వేర్వేరు భాషల్లో రాసిన ప్లకార్డులు ప్రదర్శిం చారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు పార్లమెంటు మకర ద్వారం నుంచి జాతీయ గీతం పాడుకుంటూ ఎంపీలు మార్చ్‌ ప్రారంభించారు. పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడిన తర్వాత ఎంపీలు ప్రదర్శన చేపట్టారు. ‘ఎస్‌ఐఆర్‌ రద్దు,’ ‘ఓట్‌ చోరి ఆపాలి’, ‘ఎస్‌ఐర్‌Gఓట్‌ చోరీR ప్రజాస్వామ్యం ఖూనీ’, ‘ఎస్‌ఐ ఆర్‌పై మౌనమెందుకు’, ఎస్‌ఐఆర్‌` ప్రజాస్వామ్యంపై దాడి’ వంటి బ్యానర్లు ప్రదర్శించారు. ఈ నినాదాలతో ఉన్న టోపీలు, టీ షర్టులు ధరించారు. ప్రియాంకా గాంధీ వాద్రా, అఖిలేశ్‌ యాదవ్‌, కేసీ వేణుగోపాల్‌, తిరుచి శివ, డెరెక్‌ ఓ బ్రెయిన్‌, మనోజ్‌ కె రaా, మాణిక్యం ఠాకూర్‌, సుప్రియా సూలే, కనిమొళి తదితరులు పాల్గొన్నారు. ఎంపీల ర్యాలీని అడ్డుకోవడానికి ఆ మార్గాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో మహిళా నాయకులు సహా కొందరు ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి బీజేపీకి, ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనలో ఆప్‌ ఎంపీలు కూడా పాల్గొన్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న శరద్‌పవార్‌, మల్లికార్జున ఖడ్గే కూడా ర్యాలీలో భాగస్వాములయ్యారు. అఖిలేశ్‌ యాదవ్‌ బారికేడ్లు ఎక్కి దూకారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ నినాదాలిచ్చారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్యం పరిరక్షణే లక్ష్యంగా పోరాడుతున్నామని ఎంపీలు తేల్చిచెప్పారు. ప్రతినిధుల భేటీకి కాదు… ఎంపీలంతా కలిసేందుకు అనుమతి కోరినట్లు తెలిపారు. తమను ఈసీ భవన్‌ వరకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడాన్ని ఆక్షేపించారు. పార్లమెంటు ఎదుటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా అంటూ నిలదీశారు. బీజేపీ మోసాలన్నింటినీ ‘ఇండియా’ బట్టబయలు చేస్తుందని తేల్చిచెప్పారు. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని సంకల్పించారు. కేవలం 30 మందికే అనుమతి ఉందని పోలీసులు, ఈసీ అధికారులు చెప్పారు. ఇదే క్రమంలో ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ ఎంపీ సంజనా జాతవ్‌, జ్యోతిమణి సహా కొందరు ఎంపీలు బారికేడ్లు ఎక్కి దూకారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగించారు. అంతా కలిసే వెళతామని పట్టుపట్టారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ అగ్ర నాయకులు మల్లికార్జున ఖడ్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్‌పీ), సాగరిక (టీఎంసీ), సంజయ్‌ రౌత్‌ (శివసేనఉద్దవ్‌) సహా ఎంపీలందరినీ అరెస్టు చేసి... ప్రత్యేక బస్సుల్లో పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడుదల చేశారు. ‘ఇండియా’ ఎంపీలంతా వీధుల్లోకి రావడంతో దిల్లీలో ఒకింత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. 30 మంది ఎంపీలకు మాత్రమే అనుమతిస్తే... అంతకంటే ఎక్కువ మంది మార్చ్‌లో పాల్గొన్నారని, వీరిలో ఎవరు కూడా ఎన్నికల సంఘం అనుమతి కోరలేదని ఈసీ అధికారులు వెల్లడిరచారు. మార్చ్‌ను అడ్డుకోవడం, ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వెళ్లనివ్వకపోవడంపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఈసీ వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం వెనుక మర్మమేమిటి? ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని అరెస్టు అనంతరం ఎంపీలు ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం మెరుగైన విధంగా స్పందించి ఉండాల్సిందని మల్లికార్జున ఖడ్గే అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘వీవీఐపీలు చేస్తున్న శాంతియుత ప్రదర్శనను అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అందరు ఎంపీలనుద్దేశించి ఎన్నికల సంఘం మాట్లాడాల్సింది... అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాల్సింది. భాగస్వామ్య పార్టీలకు చెందిన 30 మంది ఎంపీలను మాత్రమే పంపమంటే ఎలా? 300 మంది ఉంటే 30 మందిని ఎలా ఎంపిక చేస్తాం. ఇది కుదరదు’ అని ఖడ్గే అన్నారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ పోరాటం కాదు... రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం’ అని నొక్కిచెప్పారు. ఒకరికి ఒకటే ఓటు ఉండటం కోసం జరిగే పోరాటంగా అభివర్ణించారు. ప్రక్షాళించిన, సక్రమ ఓటర్ల జాబితాలు కోరుతున్నామని తెలిపారు. ‘మేము ఈసీఐతో మాట్లాడకూడదన్నది నిజమే కానీ వాస్తవాలేమిటో ప్రజలకు తెలుసు. ఎన్నికల సంఘం నిజాలు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని రాహుల్‌ అన్నారు. అఖిలేశ్‌ మాట్లాడుతూ ‘వాళ్లు ఓట్లు ఆపుతుంటే... మేము ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం కోసం బారికేడ్లు దూకుతున్నాం. ఎన్నికల సంఘం ఇప్పటికైనా తొలగించిన ఓట్ల విషయంలో చర్యలు తీసుకోవాలి. 18 వేల ఓట్లు తొలగించినట్లు ఈసీకి నేను స్వయంగా జాబితా అందజేశాను. ఈసీ అఫిడవిట్‌ కోరితే అదీ ఇచ్చాం... కానీ వారు చర్యలు తీసుకోలేదు’ అని అఖిలేశ్‌ అన్నారు. ‘మా డిమాండ్‌ చాలా స్పష్టం. మార్చ్‌ అనంతరం ఈసీకి వినతిపత్రం ఇవ్వాలని ఎంపీలు అనుకున్నారు. కానీ నిర్వచన్‌ భవన్‌ వరకు ఎవరినీ వెళ్లనివ్వలేదు. పార్లమెంటు ఎదుట ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోంది’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. మార్చ్‌లో ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌, ఆర్‌జేడీ, వామపక్షాలతో పాటు ఇండియా భాగస్వామ్య పార్టీల ఎంపీలంతా పాల్గొన్నారు. స్పృహ కోల్పోయిన ఎంపీలు: ఓట్‌ చోరి ఆందోళన సమయంలో టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, మితాలీ బాగ్‌ స్పృహ కోల్పోయారు. రాహుల్‌ గాంధీతో పాటు కొందరు నాయకులు వారికి సహాయం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. మధ్యాహ్నం పార్లమెంటుకు... నిరసనఅరెస్టులు`విడుదల హైడ్రామా తర్వాత ప్రతిపక్ష ఎంపీలంతా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖడ్గే తమ మార్చ్‌ను అడ్డుకున్న అంశాన్ని ప్రస్తావించారు. ‘లోక్‌సభ, రాజ్యసభకు చెందిన ఎంపీలంతా ఈసీని కలిసేందుకు వెళుతుంటే అడ్డుకున్నారు. ఈసీని కలనివ్వలేదు’ అని తెలిపారు. ఖడ్గే మాట్లాడుతున్నప్పుడు అధికార పక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇదే సమయంలో సభాపక్ష నాయకుడు జేపీ నడ్డా జోక్యం చేసుకొని మణిపూర్‌ బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే మరే అంశంపై మాట్లాడటం రికార్డుల్లో ఉండకూడదని అన్నారు. ఇందుకు సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ శాస్మిత్‌ పటేల్‌ అంగీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు