కళాజ్యోతి కార్యదర్శి బాలగోండ్ల రామకృష్ణ
విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని కళాజ్యోతి (ఈ. సి. ఆర్. ఆర్. సరస్వతి నిలయం) లో ఈనెల 15వ తేదీ శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సాయంత్రం 6:30 గంటలకు కళాజ్యోతి కళాకారులచే”హితుడు”అనే ఆశ సందేశాత్మక సాంఘిక నాటికను నిర్వహించడం జరుగుతుందని కళాజ్యోతి కార్యదర్శి బాల గుండ్ల రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సభ అధ్యక్షులుగా కళాజ్యోతి అధ్యక్షులు కుంటిమల నారాయణ, ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రహదారుల భవనముల శాఖ- అనంతపురం అధికారి రాజగోపాల్ పాల్గొంటారని తెలిపారు. ఈనాటికకు రచన చిల్లర సుబ్బారావు కాగా, దర్శకత్వం బాలగొండ్ల రామకృష్ణ, సంగీతం పిడిఆర్ ప్రసాద్ రైల్వే కోడూర్, వ్యవహరిస్తారని తెలిపారు. ఈనాటికలో పాత్రలు- పాత్రధారులలో.. చక్రపాణిగా రామకృష్ణ, గౌరీపతిగా డాక్టర్ సత్యనారాయణ, ఆదిత్యగా చంద్రశేఖర్, రామ్మూర్తిగా శ్రీనివాసులు, ప్రకటన కర్తగా రాంప్రసాద్, కౌశల్యగా జ్యోతి రాణి- విజయనగరం వారు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా సాంకేతిక వర్గములో సహకారముగా పెద్దారెడ్డి ఆహార్యాముగా ఆనంద్, పర్యవేక్షణగా జగ్గా వేణుగోపాల్, సహాయకులుగా రమేష్ బాబు నాగరాజా వెంకటేష్ లు వ్యవహరిస్తారని తెలిపారు. కావున పట్టణ ప్రజలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు.
కళాజ్యోతిలో “హితుడు” హాస్య సాంఘిక నాటిక ప్రదర్శన
- Advertisement -
RELATED ARTICLES


