Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరక్తదాన శిబిరమునకు విశేష స్పందన..

రక్తదాన శిబిరమునకు విశేష స్పందన..

- Advertisement -

బీరే కుటుంబ సభ్యులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో కీర్తిశేషులు బీరే ఎర్రన్న జ్ఞాపకార్థం (మూడవ వర్ధంతి సందర్భంగా) వీరే కుటుంబ సభ్యులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని బీరే ఎర్రి స్వామి, బీరే తాతయ్య, బీర్ కేశవ, బీరే రామాంజనేయులు, బీరే నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తండ్రి అయిన కీర్తిశేషులు మీరే ఎర్రన్న జ్ఞాపకార్థం మూడవ వర్ధంతిని పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ క్యాంపు ను నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ బ్లడ్ క్యాంప్ వలన వచ్చిన రక్తాన్ని ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు, ఉపయోగపడుతుందని తెలిపారు. మొత్తం 42 మంది రక్త దానమును ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ రక్తాన్ని అనంతపురంలోని శ్రీనీత బ్లడ్ బ్యాంక్ వారికి ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని ఇందిరా నగర్ మాల ధారణ చౌడేశ్వరి దేవి భజన మండలి వారిచే దైవ సంకీర్తనలు, దేవుని పాటలు, అన్నమాచార్య సంకీర్తనలు కూడా నిర్వహించామని తెలిపారు. తదుపరి రక్త దానం చేసిన వారందరికీ కూడా ప్రశంసా పత్రాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం మాకెంతో తిరుపతి తో పాటు సంతోషాన్ని కలిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిరే కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు