విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో యుటిఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి, జోన్ నాయకులతో కలిసి యుటిఎఫ్ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణే యుటిఎఫ్ ద్యేయం అని, గత 51 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా యుటిఎఫ్ పనిచేస్తోంది అని అన్నారు. ప్రభుత్వాల చర్యలు ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించే దిశగా ఉండాలన్నారు. ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రయోగశాలగా చూడకూడదు అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలు మార్చకూడదన్నారు. సమాజానికి ఉపయోగపడే విద్యను విద్యా విధానాలను రూపొందించాలన్నారు. ప్రపంచమంతా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భారతీయ విద్య కూడా పురోభివృద్ధి చెందాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమించే దిశగా విద్యా విధానాలు ఉండాలన్నారు. మూఢనమ్మకాలను కులతత్వాన్ని ప్రాంతీయతత్వాన్ని మతతత్వాన్ని విడనాడే దిశగా విద్యాసంస్కరణలు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతిక విద్య, వైద్య విద్య, పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారాయని, పేద ప్రజలు కూడా ఇలాంటి ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హనుమంతరావు, లక్ష్మయ్య, అమర్ నారాయణరెడ్డి ,హెచ్ రామాంజనేయులు, సకల చంద్రశేఖర్, ఆంజనేయులు, సురేష్, అమర్నాథ్ రెడ్డి, కృష్ణ తేజ , నాగేంద్ర.. తదితరులు ..పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణే ద్యేయం – యూటీఎఫ్
- Advertisement -
RELATED ARTICLES


