వైయస్సార్సీపి 25వ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్.
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 25 వ వార్డు లక్ష్మీ చెన్నకేశవ పురములో పూల చెట్ల ఆనంద్ భార్య పూల చెట్ల ముత్యాలమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం పోగా, ఆడపిల్లకు జన్మనిచ్చి తల్లి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న 25వ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు ముత్యాలమ్మ భర్తకు అంతక్రియల కోసం ఆర్థిక సహాయముగా 10,000 రూపాయల నగదును వారు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కౌన్సిలర్కు కృతజ్ఞతలను తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా 25వ వార్డులో ప్రజలకు ఏ సహాయం కావాలన్న కౌన్సిలర్ ముందుండి, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, సమస్యలను పరిష్కరించుటలో వారికి వారే సాటి అని ప్రజలు తెలుపుతున్నరూ. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ నా వార్డులోని ప్రజలకు ఏ సమస్యలు లేకుండా పరిష్కార దిశగా తాను కృషి చేయడమే నా ప్రధమ కర్తవ్యం అని తెలిపారు. నట శేఖర్ కృష్ణ, సినీ హీరో మహేష్ వారి అడుగుజాడల్లో పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వర్తించడం కూడా జరిగిందని తెలుపుతున్నారు.
పేద కుటుంబానికి ఆర్థిక సహాయం..
- Advertisement -
RELATED ARTICLES


