Homeజిల్లాలుశ్రీ సత్యసాయికాలువలో పడి చేనేత కార్మికులు మృతి

కాలువలో పడి చేనేత కార్మికులు మృతి

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని శ్రీదేవి థియేటర్ వద్ద మురికి కాలువలో పడి బసవన్న కట్ట వీరికి చెందిన సుపారి నాగరాజు (60) అనే చేనేత కార్మికుడు మృతి చెందాడు. వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాలకు వెళితే సుఫారి నాగరాజు పట్టుచీరలు మడత వేస్తూ జీవనాన్ని కొనసాగించేవాడని, తరచూ మద్యాన్ని సేవిస్తూ ఉన్న క్రమంలో మద్యం సేవించి డ్రైనేజీ పక్కన పడిపోయాడు. దీంతో రాత్రి కురిసిన వర్షం రావడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీరు అధికం కావడంతో డ్రైనేజీలో పడి చనిపోవడం జరిగిందని తెలిపారు. సోమవారం పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలను శుభ్రం చేస్తుండగా నాగరాజు మృతదేహం బయటపడింది అని తెలిపారు. దీంతో శవాన్ని స్థానికులు గుర్తించడంతో మృతుని కుమారుడు మనోహర్ కు సమాచారం అందించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించామని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు