అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని అధ్యక్షులు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, కార్యదర్శి విజయభాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకర కంటి ఆసుపత్రి -బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ- శ్రీ సత్య సాయి జిల్లా సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ, కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశులు జ్ఞాపకార్థం వీరి కోడలు, కుమారుడు దాసరి రమాదేవి డివి. వెంకటేశులు (చిట్టి) అండ్ సన్స్ వారు నిర్వహించడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. క్యాంపు చైర్మన్గా రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 135 మంది కంటి రోగులు పాల్గొనగా, వారందరికీ డాక్టర్ మాన్షి చేత వైద్య పరీక్షలు నిర్వహించగా 105 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరందరికీ కూడా బెంగుళూరు శంకరా కంటి ఆసుపత్రిలో ఉచిత వశతి, ఉచిత భోజనం, ఉచిత ఆపరేషన్, ఉచిత అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. శిబిర దాతలు డివి. వెంకటేశులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ కొన్ని సంవత్సరాలుగా వేలాదిమందికి కంటి చూపులను కలిగించిందని, ముఖ్యంగా పేదలకు సేవ చేయుటలో రోటరీ క్లబ్ ఎంతో మంచి గుర్తింపు పొందడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రోటరీ క్లబ్ వారు, శంకరా కంటి ఆసుపత్రి వైద్యులు కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్నకుమార్, సుదర్శన్ గుప్తా, రత్న శేఖర్ రెడ్డి, రమేష్ బాబు, రామకృష్ణ, కొండయ్య, మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, జయసింహ,బండారు వెంకటాచలం, గట్టు హరినాథ్, డాక్టర్ నరసింహులు, శంకరా కంటి ఆసుపత్రి మేనేజర్ శివ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


