విశాలాంధ్ర పుట్టపర్తి:- మున్సిపాలిటీ కి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి ఎస్ చేతన్ అన్నారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు కదిరి మున్సిపల్ అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి ఎస్ చేతన్ కదిరి పట్టణము నందు గల పాత మునిసిపల్ కార్యాలయ భవనమును మరియు హిందూపురంరోడ్డు నందు గల పాత మునిసిపల్ ఉన్నత పాఠశాల భవనము శిథిలావస్థ దశలో ఉన్నందున వాటిని పడగొట్టి మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించుటకు, హిందూపురం రోడ్డు నందు శిథిలావస్థ దశలో ఉన్న పాత మునిసిపల్ ఉన్నత పాఠశాల భవనమును పడగొట్టి మల్టి లెవల్ పార్కింగ్ నిర్మించుటకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ ఛైర్పర్సన్ దిల్షాదున్నిసా, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ సంజీవ్ కుమార్, కదిరి , పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ నరసింహ మూర్తి తదితర అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
మున్సిపాలిటీ కి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ టి ఎస్ చేతన్
- Advertisement -
RELATED ARTICLES


