వందేళ్ళ ఘన చరిత్ర చాటిన కమ్యూనిస్టు కార్యకర్తలు..రెడ్ షర్ట్ వలంటీర్ల ర్యాలీ
విశాలాంధ్ర బ్యూరో, అనంతపురం..భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్ర కలిగిన వైనాన్ని చాటి చెబుతూ అనంతపురం నగరంలో మంగళవారం సిపిఐ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్ షర్ట్ వాలంటీర్లు ర్యాలీకి ముందు భాగంలో 100 జండాలతో నడిచారు. ర్యాలీకి ముందు భాగంలో సిపిఐ అగ్రనాయకులు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ , రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి జాఫర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, మల్లికార్జున కార్యవర్గ సభ్యులు ఎండి సంజీవులు, రాజారెడ్డి, చంద్రానాయక్, మహిళ సమాఖ్య, ఏఐఎస్ఎఫ్, ప్రజా సంఘాల నాయకులు నడిచారు. స్థానిక ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి టవర్ క్లాక్ మీదుగా రాజు రోడ్డు వెంబడి సప్తగిరి సర్కిల్ , కేఎస్సార్ డిగ్రీ కాలేజ్ వరకు భారీ ర్యాలీ సాగింది. ర్యాలీలో గురవయ్యల డప్పు వాయిద్యాలు, చిన్నారుల కోలాటాలు, ప్రజానాట్యమండలి పాటలతో ఉత్సాహభరితంగా కొనసాగింది. నియోజకవర్గాల వారీగా ర్యాలీలో సిపిఐ ప్రజాసంఘాల నాయకులు నడిచారు. ఈ ర్యాలీలో అనంతపురం నుండి నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శులు రమణయ్య , కృష్ణుడు, నాయకత్వం వహించారు. రాప్తాడు నియోజకవర్గ నుండి నియోజకవర్గ కార్యదర్శి మేకల రమేష్, సహాయ కార్యదర్శి నీళ్ల పాల రామకృష్ణ నాయకత్వం వహించారు. శింగనమల నియోజకవర్గం నుండి సిపిఐ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలను తరలించేందుకు, కత్తి నారాయణస్వామి నాయకత్వం వహించారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుండి వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కార్యదర్శి జి, గోపాల్ నాయకత్వం వహించారు.
ఉరవకొండ నియోజకవర్గం మల్లికార్జున,తాడిపత్రి నియోజకవర్గం, రంగయ్య, చిరంజీవి, రాయదుర్గం నియోజకవర్గం, నాగార్జున గుంతకల్లు నియోజక వర్గానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి,నాయకత్వం వహించి పార్టీ నాయకులను కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘాలైన రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నప్ప యాదవ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి,మహిళా సమాఖ్య నుండి పార్వతి ప్రసాద్, పద్మావతి,
వ్యవసాయ కార్మిక సంఘం నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, కందుకూరు నాగరాజు,
ఏఐవైఎఫ్ నుండి ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే కోటేష్, కే సంతోష్ కుమార్ , ఏఐఎస్ఎఫ్ నుండి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హనుమంతరాయుడు, కుళ్లాయప్పలు నాయకత్వం వహించారు.
ఆయా సంఘాలకు నాయకత్వం వహించారు. ర్యాలీ బహిరంగ సభ విజయవంతం కావడం నాయకత్వం వహించిన నాయకులు ఆనందం ఉప్పొంగింది అదేవిధంగాయి క్రమశిక్షణతో కార్యకర్తలు మలుచుకోవడం జిల్లా నాయకత్వాన్ని అబ్బురపరిచింది మహాసభల సందర్భంగా ఎటువంటి లోటు పాట్లు లేకుండా విజయవంతం అయినందుకు రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


