- ఇలాంటి చిత్రాల ద్వారా శోభన్ బాబు ఎప్పటికీ మా అభిమానుల మదిలో ఉంటారు .. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు భట్టిప్రోలు
భీమవరం ;
తెలుగు ప్రేక్షకుల జేబులు విపరీతంగా దోచిన జేబుదొంగ చిత్రానికి 50 వసంతాలు పూర్తి అయ్యాయని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు భట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం భీమవరం తటవర్తి నానాజీ కాంప్లెక్స్ లో అభిమానుల ఆధ్వర్యంలో 50 వసంతాల సంబరాలను నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ 1975 ఆగస్టు 14న శోభన్ బాబు – మంజుల జోడీలో వచ్చిన సూపర్ హిట్ సినిమా జేబు దొంగ అని, ఈ చిత్రంలోని పాటలు, హుషారయిన నటన , రాజబాబు అల్లరి ఈ సినిమా సక్సెస్ కు కారణాలని, వి మధుసూధనరావు దర్శకత్వంలో ముళ్ళపూడి డైలాగ్స్ వ్రాసారని, నీలాల నింగిలో మేఘాల తేరులో పాట సినిమాకే హైలైట్ అని అన్నారు. హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తెనాలి, రాజమహేంద్రవరం, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం సెంటర్లలో వంద రోజులు ఆడిందని, హైదరాబాదులో జరిగిన శత దినోత్సవ వేడుకలు కూడా జరిగాయని, ఒరిస్సాలో 50 రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమా జేబుదొంగ అని, ఈ జేబుదొంగ చిత్రం ఎంతోమంది ప్రేక్షకుల జేబులను దోచిందని అన్నారు. ఇటువంటి చిత్రాలెన్నో శోభన్ బాబు నటించారని, ఇలాంటి చిత్రాల ద్వారా శోభన్ బాబు ఎప్పటికీ మా అభిమానుల మదిలో ఉండిపోయారని వారు అన్నారు.కార్యక్రమం లో బొండా రాంబాబు,అడ్డాల సత్యనారాయణ, కారుమూరి భాస్కరరావు,కంచర్ల భాస్కరరావు గుప్తా, పెదపాటి రాజబాబు, లోయ వేణు బెనర్జీ పాలుగొన్నారు


