విశాలాంధ్ర – నిడదవోలు:
నిడదవోలు జనసేనలో అభ్యర్థులు కరువయ్యారని, నామినేటెడ్ పదవులు ఇస్తామన్న ఎవరు ముందుకు రావడం లేదని తమకు తోచిన విధంగా ఒక మీడియా ఛానల్ లో ప్రసారం చేసిన కథనాలను ఉంటా చూడ మండలం జనసేన పార్టీ నాయకులు ఖందించారు. ఉండ్రాజవరం మండలం పాలంగి సొసైటీ అధ్యక్షుడు ఎంపికపై వచ్చిన అసత్య వార్తను నిడదవోలు మంత్రి కార్యాలయంలో ఉండ్రాజవరం మండలం జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖండించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని చానల్స్ జర్నలిజం విలువలను ఎప్పుడో గాలికి వదిలేసి, ప్రజలకు ఉన్న మీడియా విశ్వసనీయతను పక్కన బెట్టి కూటమి వ్యతిరేక పార్టీలకు చెంచాగిరి చేస్తున్నాయని విమర్శించారు. తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో, అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రసారం చేస్తోన్నాయని ఎవరెన్ని అవాస్తవ కథనాలు ప్రసారం చేసినా అంపశయ్యపై ఉన్న కూటమి వ్యతిరేక పార్టీని ఎవరు కాపాడలేరన్నారు. ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసిన ఆ ఛానల్ తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు క్షమాపణ లు చెప్పాలన్నారు. లేదంటే ఆ చానల్స్ ను బహిష్కరిస్తామని అన్నారు. నిడదవోలు నియోజకవర్గం లో జనసేన గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిన విషయం ఆ చానల్ కి కి తెలియదా? జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ నిడదవోలు అనే విషయం మర్చిపోయిందా? అంటూ ప్రశ్నించారు.సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21/21, 2/2 తో 100% సాధించిందన్న విషయం ఎన్టీవీ కి గుర్తులేదా?నిడదవోలులో జనసేనకు నాయకులు కరువయ్యారని ఆ టీవీ తో ఎవరైనా మొరపెట్టుకున్నారా..? లేక వైసీపీని ఒక్కొక్క నాయకుడు వీడుతున్నారని భయపడి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో తెలపాలన్నారు. ఇంకోసారి ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే ఎంక్వయిరీ వేస్తాం ఖబర్దార్ అంటూ హెచ్చరించారు
దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి.. ఇలా ఫేక్ న్యూస్ లు ప్రచారం చేసి ఏం చేద్దామనుకుంటున్నారు? ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండ్రాజవరం మండల అధ్యక్షులు వీరమల్ల బాలాజీ, పాలంగి సొసైటీ అధ్యక్షులు కాకర్ల నాని, నిమ్మల సాంబమూర్తి, రమేష్, ఫణి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


