Homeఆంధ్రప్రదేశ్రెచ్చిపోతున్న( కాల్) నాగులు.

రెచ్చిపోతున్న( కాల్) నాగులు.

- Advertisement -

తాత్కాలిక రిజిస్ట్రేషన్ స్థానంలో సేల్ డీడ్లు.

లబోదిబోమంటున్న బాధితులు.

విశాలాంధ్ర – కొవ్వూరు : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు కాల్ మనీ కేసులు పెద్ద స్థాయిలో నమోదయి పోలీసు వ్యవస్థలో బాధితులకు ఉపశమనం లభించేది. అయితే ఇటీవల కాల్ మనీ అనే పదం అటకెక్కి పోవడంతో మరలా వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మరొకవైపు పోలీసుల సైతం న్యాయస్థానాలకు వెళ్లి న్యాయం పొందమని బాధితులకు చెప్పడంతో గత్యంతరం లేక వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగిపోతున్నారు. గతంలో స్తరాస్తులపై వడ్డీకి డబ్బులు తీసుకోవాల్సిన సమయంలో అప్పు ఇచ్చే వారికి తమ స్థలాలు, ఇల్లు, పొలాలు తాత్కాలికంగా అర్పించే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి కొంతకాలం సమయం వారి నుంచి తీసుకునేవారు. అప్పటినుంచి నెల నెల వడ్డీ చెల్లిస్తూ తమకు డబ్బులు అందిన వేల అప్పిచ్చిన వారికి చెల్లించి మరల తమ పేరట తమ ఆస్తిని తిరిగి రాయించుకునేవారు. ఇదంతా బాగా జరుగుతున్న వేళ.. సేల్ డీడ్ అనే పదం తెరమీదకు వచ్చింది. దీంతో అప్పు తెచ్చుకునే వారి పరిస్థితి ని మారింది. ఈ సేల్ డెడ్ ఒప్పందం ప్రకారం అప్పు తీసుకున్న వ్యక్తి అప్పిచ్చే వారి పేరిట తమ ఆస్తిని అర్పించేవారికి చెందే విధంగా సెల్ రీడ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
అప్పిచ్చేటప్పుడు ఒక వడ్డీ రేటు.. ఇచ్చిన తర్వాత మరొక రేటు..
అప్పిచ్చేవారు అప్పు ఇచ్చేటప్పుడు తక్కువ మొత్తంలో వడ్డీ అని చెప్పి తీసుకున్న తర్వాత కొన్నాళ్లకు అధికవడ్డీ వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు అప్పు తీసుకున్న వారి స్థలాలను, ఇల్లను, పొలాలను కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇలా కబ్జాలకి గురైన సమయంలో పోలీసుల వద్ద తమ గోడు వెల్లబోసుకుంటే కొన్ని ప్రాంతాలలో పోలీసులు అప్పు తీసుకునేటప్పుడు మాకు చెప్పుతీసుకుంటున్నారా.. మీ అవసరాల కోసం ఆదరాబాదరాగా అప్పిచ్చేవారు చెప్పినచోటల్లా సంతకాలు పెట్టేసి తీరా చివరి నిమిషంలో మా వద్దకు వచ్చి న్యాయం చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారని బాధితులు ఆపోతున్నారు. కొందరు మనసున్న పోలీసులు మాత్రం స్పందించి అప్పిచ్చిన వారిని పిలిపించి రాజీ చేసుకోండి లేదంటే కేసు పెడతామంటూ నిలదీయడంతో కొందరు దారికి వస్తున్నట్లు తెలుస్తోంది.
కాబోలు వ్యాపారులు ఇలా..
స్థిరాస్తులు పై వడ్డీకిచ్చే వాళ్ళ మాట ఒకలా ఉంటే కాబోలీ పద్ధతిలో వడ్డీ వ్యాపారం చేసేవారు విధానం మరొకలాగ ఉంది. వీరు సారాంశం ఏమిటంటే ఒక మొత్తాన్ని వడ్డీకి ఇస్తారు. అసలుతో వడ్డీ కలిపి వారానికి ఒకసారి అసలు ప్లస్ వడ్డీ కలిపి అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఏదైనా కారణం చేత ఒక వారం చెల్లించకపోతే మరల వారానికి పెద్ద మొత్తంలో వడ్డీ వేసి రెండు వారాలకు చెందిన మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఈ వ్యవస్థలో చిరు వ్యాపారులే ఉండటం విశేషం. వర్షం వచ్చినా కష్టం వచ్చినా ఆ వారం డబ్బు చెల్లించకపోతే ఇక వారి పని అయిపోయినట్లే. ఒకవైపు ఇలాగే ఉంటే మరొకవైపు ఈ కాబోలీ వడ్డీ వ్యాపారులు వారంలోని ఏడు రోజులను ఉపయోగించుకుంటున్నారు. అదెలాగంటే ఉదాహరణకు అసలు వడ్డీకి ఒకరు ఆదివారం వస్తే.. మరోకరు సోమవారం వస్తారు. దీంతో వారి అసలు పేరు పక్కకు వెళ్లి ఆదివారం అప్పారావు, సోమవారం సుబ్బారావు అన్న చందాన తయారయింది. ఏతవాతా చిరు వ్యాపారులకు ఆదివారం తీసుకున్న వారికి అప్పు తీర్చడానికి సోమవారం వారి వద్ద అప్పు తీసుకుని సరిపెడుతుంటారు. ఈ ఈ క్రమంలో మరొక మంగళవారం మల్లి బాబు వడ్డీ వ్యాపారి పేరున తయారవుతాడు. ఇక చిరు వ్యాపారుల పని వారం రోజులు పంపించిన వరకే చెల్లించి కొన్నిసార్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. డ్వాక్రా మహిళలకు అయినా బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొని నెలనెలా కట్టే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. అదేవిధంగా పెద్దగా అప్పు తీసుకునే వారికి సేల్ డీడ్ పద్ధతి తొలగించి, పాత విధానంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఒక వర్గం కోరుతుండగా, చిరు వ్యాపారులు తమకు బ్యాంకుల ద్వారా చిన్న సైజు మొత్తాలను అందజేసి తిరిగి బ్యాంకులో చెల్లించే వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు