Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా గంధం వినాయక నిమజ్జన కార్యక్రమం

ఘనంగా గంధం వినాయక నిమజ్జన కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం ; వినాయక చవితి పండుగ సందర్భంగా ధర్మవరం పట్టణంలో అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. గత రెండు రోజులుగా నిమజ్జనా కార్యక్రమాలు భక్తాదులు, నిర్వాహకులు నడుమ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
దాదాపు ఐదు గంటల పాటు గంధం వినాయకుడు ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కేశవ నగర్ నందు చేనేత ఎర్రజోడు లోకేష్, ఎర్రజోడు చంద్ర కలసి 160 కేజీల గంధం వినాయకుని ఏర్పాటు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అధిక సంఖ్యలో భక్తాదులు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకున్నారు. అనంతరం లోకేష్, చంద్ర మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా గంధంతో వినాయకుడిని తయారు చేస్తున్నామన్నారు. వినాయకుడికి పసుపు, కుంకుమ, పండ్లు, గరిక, ప్రీతికరమైన ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించామన్నారు. ప్రత్యేక అలంకరణతో గంధం వినాయకునికి, లక్ష్మీ, సరస్వతికి పూజలు చేశారు. ఆదివారం గంధం వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ వినాయకుని ట్రాక్టర్ పై ఉంచి పట్టణంలోని కేశవ నగర్, తేరు బజారు, అంజిమాన్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, కాలేజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీనగర్, కదిరి గేటు, శివానగర్ వరకు గంధం వినాయకుడని ఊరేగించారు. చిన్నారులు, మహిళలు, యువకులు ఒకరికొకరు రంగులు పూసుకొని, డాన్సులు చేస్తూ నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు. గంధం వినాయకుని నిమజ్జనం కొరకు రోజ్ వాటర్ ను ఉపయోగించి నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జనం కార్యక్రమంలో లోకేష్, చంద్ర వారి కుటుంబ సభ్యులు, కేశవ నగర్ ప్రజలు, స్నేహితులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు