ఎఐకెఎస్ జెండాను ఆవిష్కరించిన మల్నీడి యల్లమందరావు
విశాలాంధ్రవిజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలతో ప్రధానమైన వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిరదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్నీడీ యల్లమందరావు విచారం వ్యక్తం చేశారు. అఖిల భారత రైతు సంఘం డిమాండ్లు దినోత్సవరం సందర్భంగా జిల్లాలోని కొటికలపూడి గ్రామంలో ఎఐకెఎస్ పతాకాన్ని సోమవారం రైతు నాయకులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యల్లమందరావు మాట్లాడుతూ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటికే, 4.50లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన చెందారు. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు, ఆత్మ హత్యల నివారణకు స్వామినాధన్ చేసిన విలువైన సూచనలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిదన్నారు. సమగ్ర పంటల
ఉత్పత్తి వ్యయానికి 50శాతం అదనంగా కలిపి(సి2ం50శాతం) మద్దతు ధరలు ఇస్తామని 2014 ఎన్నికల ప్రణాళికలో పెట్టి కూడా వాగ్దానాన్ని అమలు చేయలేదన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 2025నాటికి కూడా చేయలేదని విమర్శించారు.. ప్రతి సంవత్సరం మద్దతు ధరలు లభించక, మన రైతాంగం సుమారు 3లక్షల కోట్లు నష్టపోతున్నారని పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయని స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలను ప్రకటించి, చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకలు జొన్నలగడ్డ కోటేశ్వరరావు, మల్నీడి గోవిందరావు, యేడ్లూరి పూర్ణచంద్రరావు, యేడ్లూరి సీతయ్య, మల్నీడి వెంకట మంగేశ్వరరావు, యేడ్లూరి రమేష్, మల్నీడి నాగేశ్వరరావు, కొమరవల్లి పౌలు, బండి రామారావు, పీతా కొండలు, శీలం చంద్రం, శ్రీరామ గోపాలరావు, గుళ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


