Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈనెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహణ..

ఈనెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహణ..

- Advertisement -

పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తారకరామాపురం గుట్ట కింద పల్లి వద్ద గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 10వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్య అధికారి హరికృష్ణ తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల కొరకు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ జాబ్ మేళా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీల కొరకు ఉద్యోగమేల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా ,డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు అని తెలియజేశారు. జాబ్ మేళాలో ఎంపికైన వారికి నెలకు 15వేల రూపాయల నుండి 25 వేల రూపాయల జీతం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరు, అనంతపురం, ధర్మవరం, పెను కొండ వంటి ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది అని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఆధార్ కార్డు, విద్య అర్హత పత్రాలు తీసుకొని రావలెనని తెలిపారు. ఈ జాబ్ మేళాకు వచ్చేవారు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా కళాశాల నెంబర్ 9182288465 కు మరింత సమాచారమును పొందవచ్చునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు