చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రైతులకు ఇన్స్పుట్ సబ్సిడీ పరిహారాన్ని తక్షణమే మంజూరు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ముదిగుబ్బలో విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి
చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే విస్తీర్ణంలో పెద్ద మండలం గా పేరుగాంచిన ఈ ప్రాంతంలో 70 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు, ఈ నేపథ్యంలో తరచూ అతివృష్టి అనావృష్టి కారణాలతో కనీస పెట్టుబడులు కూడా దక్కక రైతన్నలు తమ పంటలు నష్టపోతున్నారని పేర్కొన్నారు, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతన్నలకు బీమా పరిహారం గాని ఇన్పుట్ సబ్సిడీ గాని ఒక పైసా కూడా చెల్లించకపోవడం దారుణం అన్నారు, రైతులు తమ పంటల రుణాల రెన్యువల్ ప్రక్రియలో భాగంగా ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం చెల్లించడమే కాక ఫసల్ బీమా పథకం ద్వారా కూడా చాలామంది రైతన్నలు వేరుశనగ, కంది, తదితర పంటలతో పాటు పండ్ల తోటలకు కూడా ముఖ్యంగా మామిడి పంటకు ఎకరాకు 2000 రూ,, ప్రీమియం చెల్లించి తద్వారా ఆ పంటలు నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా ఇన్సూరెన్స్ రాకపోవడంతో ఆ రైతన్నల ఆవేదనకు అంతులేకుండా పోతోందని సిపిఐ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు భీమా పరిహారం విషయమై తాము ఇటీవల సంబంధిత ఇన్సూరెన్స్ అధికారులను ఫోన్లో సంప్రదించగా వారు సమాధానం ఇస్తూ గత మూడేళ్ల నుంచి ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో ఉందని అది మంజూరైతే తప్ప ఇన్సూరెన్స్ పరిహారం రాదని పొంతన లేని మాటలు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా గత రెండు మూడేళ్లుగా ప్రభుత్వం తరచూ ఈ ప్రాంతాన్ని కరువు మండలం గా ప్రకటించడంతోపాటు గత ఏడాది కరువు బృందం కూడా ఈ మండలంలో పర్యటించి రైతన్నల పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన కూడా నేటికీ మండల రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకపోవడం విచారకరమన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుస్తోందని సిపిఐ నాయకులు ఎద్దేవా చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారంతో పాటు ఇప్పుడు సబ్సిడీ కూడా మంజూరు చేయాలన్నారు, లేనిపక్షంలో రైతన్నలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు ప్రభుత్వానికి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల సహాయ కార్యదర్శి ఈశ్వర్ నాయక్, రైతు సంఘం నాయకులు గంగిరెడ్డిపల్లి నాయుడుతో, పాటు స్థానిక నాయకులు రాధాకృష్ణ, కొండయ్య, లింగుట్ల వెంకట రాముడు, తదితరులు పాల్గొన్నారు
ఇన్పుట్ సబ్సిడీ పరిహారాన్ని కూడా తక్షణమే మంజూరు చేయండి
- Advertisement -
RELATED ARTICLES


