విశాలాంధ్ర- తాడేపల్లిగూడెం రూరల్ : అవినీతి లేని మంచి పరిపాలన అందిస్తున్న శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేయడం తగదని తాడేపల్లిగూడెం వైన్ డీలర్ అసోసియేషన్ నాయకులు విమర్శించారు. స్థానిక ఎం.వి.ఆర్ గ్రాండ్ హోటల్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు కిలపర్తి వెంకట్రావు,బడుగు వెంకటేశ్వరరావు (పెద్ద), నున్న ఆనంద్ తదితరులు మాట్లాడుతూ తమకు చెందిన లక్షలాది రూపాయల ఆస్తులను ఫణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నామని అన్నారు, ఒకపక్క వ్యాపారంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుంటే మరోపక్క రాజకీయంగా కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కొరకు మా వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు మద్యం వ్యాపారులపై జాలి చూపాలని కోరారు ఇబ్బందులు గురి చేయొద్దని అన్నారు ఇటీవల షాడో ఎమ్మెల్యే అంటూసోషల్
మీడియాలో కొన్ని అవాస్తవమైన ఆరోపణలు,విమర్శలు ప్రచారం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఎక్కడా ఒక పైసా కూడా అవినీతి లేకుండా నిజాయితీగా ఎమ్మెల్యే పని చేస్తున్నారని అన్నారు. వైన్ షాపులు ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నాయని వచ్చే సంవత్సరమైనా నష్టాలు భర్తీ అవుతాయనే ఆశతో వ్యాపారాలు కొనసాగిస్తున్నామని అన్నారు. లిక్కర్ సిండికేట్ దందా,ఇసుక దందా, రియల్ ఎస్టేట్ దందా, రేషన్ బియ్యం మాఫియా అంటూ ఊహాజనితమైన ఆరోపణలను వార్తల రూపంలో ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పై బురద జల్లడమే లక్ష్యంగా ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. గత ఎమ్మెల్యే అవినీతి విశ్వరూపం అందరూ చూశారని ప్రస్తుతం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సుపరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యేకు అందరూ సహకరించాలని వారు కోరారు.ఈ సమావేశంలో వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు కిలపర్తి వెంకట్రావు,బడుగు వెంకటేశ్వరరావు (పెద్ద), ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి, మారిశెట్టి పోతురాజు, నున్న ఆనంద్, పంతం శేఖర్, బండారు వెంకటరావు, నరాలశెట్టి సంతోష్, చిరంజీవి, ఆచారి, తిరుపతిరావు తదితరులు మాట్లాడారు.
ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు తగదు
- Advertisement -
RELATED ARTICLES


