Homeఆంధ్రప్రదేశ్ఆంధ్ర మైదాన పార్టీ లను తుద‌ ముట్టించండి

ఆంధ్ర మైదాన పార్టీ లను తుద‌ ముట్టించండి

- Advertisement -


–మేడా శ్రీనివాస్ పిలుపు

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;  త‌న‌ను ప్రోత్స‌హించ‌మ‌ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచ స్థాయిలో సాధించి చూపిస్తానని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్  అన్నారు.   మన బిడ్డల భవిష్యత్ మన కళ్ళ ముందే బుగ్గి కావటం ఖాయ‌మ‌ని, అయినా మన జీవితాలకు , మన భవిష్యత్ కు ఎందుకూ  పనికిరాని కులాలు , మతాలు , వర్గాలు అవ‌స‌ర‌మా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కుల , మత ఉన్మాద ఉద్యమాలు తీవ్రవాదం కన్నా ప్రమాద‌మ‌ని, కులం మత్తు మాటలతో రెచ్చగొట్టేటోళ్ళు అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభలకు వెళుతున్నార‌ని,  ఆ కులాల భవిష్యత్ మాత్రం మురికి జీవితాలకే పరిమితం అవుతుంద‌న్నారు.  కొన్ని అంతర్గత సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్  తెలంగాణా రాష్ట్రాల్లో  ఇప్పటి వరకు కుల ఉద్యమలతో విధ్వంసాలు  సృష్టించిన వారు  ఆ కులాలు వారే కాదని , అదే విధంగా ప్రాంతీయ ఉన్మాద ఉద్యమాలు రెచ్చ గొట్టిన వారిలో అనేక మందిలో  ఆ ప్రాంతాలకు ఏ మాత్రం సంబంధం లేని వారేనని ఉన్నార‌న్నారు.   ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పాలకులుగా చెలామణి అవుతున్న కార్పొరేట్ వ్యాపార రాజకీయ పార్టీలకు నా రాష్ట్రం , నా నేల అనే మమకారం లేద‌ని, పెరిగింది . పెరుగుతుంది ఎక్కడో తెలియని బైరాగి నేతలు ఎందరో ఆంధ్ర రాష్ట్రంలో తొడలు కొడుతూ  శాంతి భద్రతల సమస్యలకు కారకులవుతున్నార‌న్నారు. పాలకులు ఒక తరహా కుట్రతో ఆంధ్రుల బంగారు భవిష్యత్ ను విచ్చిన్నం చేస్తూ వారి సొంత రాజకీయ ప్రయోజనాలకు మార్గం చేసుకుంటున్నార‌న్నారు . ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగి నేటికి 12 ఏళ్లు కావొస్తున్నా ఏ ఒక్క అభివృద్ధికి నోచుకో లేకపోయింద‌ని,  పాలకుల మత్తుకు , కార్పొరేట్ మీడియా వార్తలకు ఓటర్లు బానిసలుగా మారిపోయి మన వేలుతోనే మన కంటిని పొడిపిస్తున్నార‌న్నారు.  ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు బాగా బలపడిన కారణంగా విద్యార్దుల్లో ఉద్యమ చైతన్యం , ప్రశ్నించే తత్త్వం ఆవిరై పోతుంద‌ని, . నాటి విద్యార్థులు రాష్ట్రాల భవిష్యత్ కు , దేశ భద్రతకు దిక్సుచి వలే వుంటే,  నేటి విద్యార్దుల్లో యువ రక్తం మొద్దు బారిపోతుంద‌న్నారు..
యావత్ భారతదేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రంలో గల ఖనిజ సంపద మరే రాష్ట్రం లోను లేదద‌ని, అలాంటి గొప్ప రాష్ట్రంలో నేడు అభివృద్ధి లేకుండా పోయింద‌ని, భవిష్యత్ ఎండ మావిగా కనిపిస్తుంద‌ని,  . ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర మేధావులు ప్రస్తుత మైదాన పార్టీలను  రాష్ట్రం నుండి భహిష్కరించే విధంగా ప్రత్య‌క్ష పోరాటం లోకి రావాల‌న్నారు.  ఆంధ్ర రాష్ట్ర  అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం తాను  ఆత్మ త్యాగానికైనా సిద్దమ‌ని, త‌న‌ను ప్రోత్స‌హించ‌మ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.  సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు . ఈ సమావేశంలో ఆర్పిసి  సెక్యులర్స్   డి వి ఆర్ మూర్తి , సిమ్మా దుర్గారావు , వర్ధనపు శరత్ కుమార్ , కారుమూరి యుగంధర్, వల్లి శ్రీనివాసరావు, పసుపులేటి వీర్రాజు , సుంకర వెంకట భాస్కర రంగారావు , మాసా సుభద్ర , మాసా అప్పాయమ్మ , యలగాడ చిన్నారి, వాకటి అచ్యుతరావు, ఇప్పర్తి వర ప్రసాద్ , యర్రా బాల మురళి కృష్ణ , మీసాల హైమావతి, కందివలస రమణ  తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు